Actress: రెండో సినిమాకే డబ్బింగ్‌ చెప్పేసింది… పాతుకుపోయే రకమే!

రీల్స్‌ హీరోయిన్‌ అంటూ.. ముద్దుగా ప్రేక్షకులు పిలుచుకునే భామ సాక్షి వైద్య. ‘ఏజెంట్‌’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన అ అందం.. ఇప్పుడు ‘గాండీవధారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత లైనప్‌లో పెద్ద సినిమాలే ఉన్నాయి. ఇదంతా చూస్తే ఇప్పట్లో టాలీవుడ్‌ని వదిలేలా లేదు, ఏలేలా ఉంది అని అంటున్నారు. ఏంటీ కొన్ని సినిమాలకేనా అని అనుకుంటే.. కారణం అదొక్కటే కాదు. ఇంకొకటి కూడా ఉంది అని చెప్పాలి.

మామూలుగా టాలీవుడ్‌లోకి నార్త్‌ భామ వస్తే.. డబ్బింగ్‌ చెప్పేవారి కోసం ప్రయత్నాలు మొదలవుతాయి. ఎవరి వాయిస్‌ నప్పుతుంది అనేది చూస్తారు. అయితే సాక్షి వైద్య కోసం రెండో సినిమాకే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అవసరం లేకుండా పోయిందట. ఎందుకంటే ఈ సినిమాకే ఆమెనే డబ్బింగ్‌ చెప్పుకుంది. ఈ విషయాన్ని ఆమెనే చెప్పుకొచ్చింది. తాను ఈ సినిమాలో ఐరా అనే ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తానని, ఆ పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకున్నానని  (Actress) సాక్షి చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీకి వచ్చి దశాబద్దం దాటిపోతున్నా తెలుగు మాట్లాడటం నేర్చుకోకుండా డబ్బింగ్‌ మీద ఆధారపడుతున్న స్టార్‌ హీరోయిన్లు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఓ హీరోయిన్‌ రెండో సినిమాకే సొంత గొంతు ఇచ్చింది అంటే చాలా ఏళ్లు పాతుకుపోయే ఆలోచనలో ఉంది అని చెప్పాలి. చాలా ఏళ్లపాటు పరిశ్రమలో ఉండాలి కాబట్టి తన టాలెంట్‌ను అలా కూడా చూపించాలని అనుకుంటుందని అర్థమవుతోంది.

మరి అంత బాగా తెలుగు నేర్చేసుకుందా అంటే.. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను. పెద్ద వాక్యాలైతే అర్థం కావడం లేదు అని చెప్పింది సాక్షి. అంతేకాదు ‘గాండీవధారి అర్జున’ సినిమారే సంతకం చేసేటప్పుడే డబ్బింగ్‌ విషయం గురించి చెప్పేసిందట. తెలుగు ప్రేక్షకులు నా మీద ప్రేమను చూపిస్తున్నారు. అందుకే భాష నేర్చుకుని ఆ ప్రేమను తిరిగి ఇస్తా అంటోంది. దుల్కర్‌ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్‌’ సినిమాలో నటిస్తున్న సాక్షి… రవితేజతో ఓ సినిమా చేస్తుందని టాక్‌. ఇక ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రీకరణ త్వరలోనే మొదలవుతుందని చెప్పింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus