చిత్రపరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి పరిచయం అవసరం లేదు. ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి సమంత తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను అనుభవించారు. అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కొని కెరీర్లో ముందుకు నడుస్తున్నటువంటి ఈమె ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారని చెప్పాలి. ఇలా తనకెదురైన సవాళ్ళను అదిగమించి ఈమె కెరియర్ లో ముందుకు దూసుకుపోతున్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి మార్చి 4వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా లేడీ డైరెక్టర్ కు సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ సందర్భంగా సమంత పోస్ట్ చేస్తూ.. ఎంత కష్టమున్నా సరే దాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వని నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. బాధగా ఉండాల్సిన సమయంలోను నవ్విస్తావు…
ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తావు… నువ్వు లేకుండా నేనేం చేయగలను? లవ్ యు హ్యాపీ బర్త్ డే అంటూ నందిని రెడ్డితో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేశారు. ఇలా సమంత తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో నందిని రెడ్డి రిప్లై ఇస్తూ బిగ్ హగ్స్.. లవ్ యు సామ్ అంటూ రిప్లై ఇచ్చారు.ఇక వీరిద్దరి కాంబినేషన్లో జబర్దస్త్,ఓ బేబీ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇక సమంత జబర్దస్త్ సినిమా సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. అలాగే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమయంలోనూ, ఇక తాజాగా ఈమె మయూసైటిసిస్ వ్యాధి బారిన పడినప్పుడు కూడా నందిని రెడ్డి సమంతకు ఎంతో మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!