Samantha: స్టార్ హీరోయిన్ కి హీరో కష్టాలు!

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ సిరీస్ తో బాలీవుడ్ లో కూడా ఫేమస్ అయింది. దీంతో ఆమెకి అవకాశాలు బాగా పెరిగాయి. నిజానికి సినిమాల నుంచి కొన్నాళ్లపాటు గ్యాప్ తీసుకోవాలనుకుంది సమంత. కానీ అనూహ్యంగా తన భర్తతో విడిపోవడంతో కెరీర్ పై ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలను లైన్లో పెడుతోంది. రీసెంట్ గానే ఓ బైలింగ్యువల్ సినిమాలో నటించబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.

దీంతో పాటు ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్న సినిమాకి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీదేవి మూవీస్ కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి ఇప్పుడు హీరో కావాలి. దీనికోసం వెతుకులాట మొదలుపెట్టారు దర్శకనిర్మాతలు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో మన హీరోలెవరూ కూడా నటించడానికి ముందుకు రావడం లేదు. అలా అని చిన్న హీరోని తీసుకోలేరు. సమంత రేంజ్ కి తగ్గ హీరో జంటగా కనిపించాల్సిందే.

అందుకే ఎవరిని తీసుకోవాలనే ఆలోచన పడ్డారు. నవంబర్ లో సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో సమంత కొత్త లుక్ తో కనిపించబోతుందని చెబుతున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus