Samantha: సమంత సంపాదన మామూలుగా లేదుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకుని లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సైతం సమంత విజయాలను అందుకుంటున్నారు. సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి ఏకంగా 15 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా సమంతకు ఆఫర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సినిమాలతోనే కాకుండా వేర్వేరు దారుల్లో సమంత ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఉండటం గమనార్హం.

సమంత ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల నుంచి 4కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. శాకుంతలం సినిమాను సమంత ఇప్పటికే పూర్తి చేయగా శాకుంతలం మూవీ సమంత స్థాయిని పెంచేలా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ తర్వాత బాలీవుడ్ లో కూడా సమంతకు ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. మరోవైపు సమంత ఇన్ స్టాగ్రామ్ పోస్టుల ద్వారా ఒక్కో పోస్ట్ కు 7 లక్షల రూపాయల నుంచి 13 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

సమంత సైడ్ ఇన్ కమ్ ఏకంగా కోటిన్నర రూపాయలు అని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత సన్నిహితులతో కలిసి హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. సమంత విడాకుల గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. 4 నెలల తర్వాత సమంత కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని సమాచారం.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus