Actress Sana: రొమాంటిక్ సీన్ గురించి సీనియర్ నటి సన షాకింగ్ కామెంట్స్..!

కొన్ని సార్లు సినిమాలు, వెబ్ సిరీస్‌లు కేవలం ఒకే ఒక్క సీన్‌తో పాపులర్ అయిపోతుంటాయి.. అలా సోషల్ మీడియాలో సీనియర్ నటి సన, ‘బిగ్ బాస్’ ఫేమ్ అలీ రెజా‌తో చేసిన ఓ రొమాంటిక్ సీన్ తెగ చక్కర్లు కొట్టింది.. పద్దతిగా హోమ్లీ పాత్రల్లో కనిపించే సనాని అలాంటి సాలిడ్ సీన్‌లో చేసే సరికి అంతా షాక్ అయ్యారు.. సన చేసిన ఆ సీన్ ‘మెట్రో కథలు’ సిరీస్‌లోనిది.. ఒక సీన్‌లో అలీరెజా, సన భర్తకి యాక్సిడెంట్ చేస్తాడు.. హాస్పిటల్‌కి వచ్చిన ఆమె.. ‘చూసి నడపలేవా?’ అని అలీ చెంపపై లాగిపెట్టి కొడుతుంది..

చావుబతుకుల మధ్య ఉన్న తాగుబోతు భర్తని చూసి ఎమోషనల్ అవుతుంది.. అయితే అలీ చేసిన దాంట్లో తప్పు లేదని తెలుసుకుని రియలైజ్ అవుతుంది.. అలా అనుకోకుండా ఇంటికి వెళ్లబోతుండగా ఆమె కార్ ట్రబుల్ ఇవ్వడంతో.. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే కార్ ఎక్కుతుంది.. ఆ తర్వాత ఆకలి వేస్తుందని అలీరెజా కూడా సన ఇంట్లోకి వెళ్తాడు.. తన బాధ మొత్తం సన.. అలీతో చెప్పుకుంటుంది.. ఆ తర్వాత ఓ సందర్భంలో ఇద్దరూ శృ0గారంలో పాల్గొంటారు.. సిరీస్ గురించి ఏమో గానీ ఈ సీన్ గురించి అయితే అప్పట్లో పెద్ద చర్చే నడిచింది..

తాజాగా దీనిపై సన క్లారిటీ ఇచ్చింది.. ‘‘నేను (Sana) ఆ రోల్ చేయడానికి కారణం డైరెక్టర్ కరుణ కుమార్, రైటర్ ఖాదీర్ బాబు.. ‘మెట్రో కథలు’ సిరీస్‌లో నేను చేసిన స్టోరీలో.. మిడిల్ క్లాస్ మహిళ ఎంత స్ట్రగుల్ అవుతుందనేది చూపించారు.. తాగుబోతు భర్త ఇంట్లో ఉండి, భార్యని పట్టించుకోకపోతే.. బయట జనం ఏం మాట్లాడుకుంటారు?.. ఇంటి బాధ్యతలతో పాటు.. లోలోపల కోరికలు కూడా కలుగుతూ ఉంటాయి.. ప్రస్తుతం సమాజంలో జరిగే వాటినే సిరీస్‌లో చూపించారు.. ఆ పాత్రని చాలా నీట్‌గా ప్రెజెంట్ చేశారు.. మంచి మెసేజ్ ఉంది..

మంచి ప్రొడక్షన్ హౌస్.. అలా ఈ పాత్ర చేయాల్సి వచ్చింది.. నా రోల్ చూసి ఆ వయసులో ఉన్న చాలామంది మహిళలు కనెక్ట్ అవుతారు.. తను కావాలని తప్పు చేయదు.. అనుకోకుండా అలా జరుగుతుంది.. చిన్న వీక్ మూమెంట్‌లో చేసిన తప్పు అది.. ఆ తప్పు నాకు నచ్చింది కాబట్టి ఒప్పుకొన్నాను.. అది మెసేజ్.. ఇలా జరుగుతుంది కూడా.. నన్ను చూసి ఇన్‌స్పైర్ అవుతారని ఆ రోల్ చేశాను.. ఇలాంటి స్టఫ్ ఉన్న రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను’’ అని చెప్పుకొచ్చింది సన..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus