టాప్ హీరోయిన్స్ కి పోటీగా షాలిని పాండే!

  • December 2, 2017 / 10:45 AM IST

ఈ ఏడాది సంచలన హిట్ సాధించిన మూవీ అర్జున్ రెడ్డి. ఇందులో హీరో హీరోయిన్లుగా నటించిన విజయ్ దేవరకొండ, షాలిని పాండే లకు ఆఫర్లు వెల్లువెత్తాయి. విజయ్ తెలుగు సినిమాలకు సంతకాలు చేస్తుంటే.. షాలిని పాండే మాత్రం తమిళ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత ఆమె సైన్ చేసిన మూవీ మహానటి. ఇది తెలుగు, తమిళ భాషలో రిలీజ్ కానుంది. ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటూనే అనేక కథలను షాలిని వింటోంది. వచ్చిన వాటినల్లా ఓకే చెప్పకండా తనకి సూటైన పాత్రలకు ఎంచుకుంటోంది. తెలుగులో సూపర్ హిట్ సాధించిన ‘100% లవ్’ సినిమాకు తమిళ్ రీమేక్ ‘100% కాదల్’ లో షాలినీ పాండేనే హీరోయిన్‌గా తీసుకున్నారు.

తమన్నా పాత్రలో మెప్పించడానికి ట్రై చేస్తోంది. ఈ సినిమా తర్వాత హీరో జీవాతో రొమాన్స్ చేసేందుకు అవకాశం కొట్టేసిందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు మరికొన్ని తమిళ కథలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. షాలిని జోరు చూస్తుంటే నేటి టాప్ హీరోయిన్స్ కి గట్టి పోయి ఇవ్వడం గ్యారంటీ అని తెలుస్తోంది. 100% కాదల్ హిట్ అయితే తమిళంలోనూ షాలిని జెండా పాతేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus