మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఇటీవల ఓ బూతు వెబ్ సిరీస్ వచ్చింది. అదే ‘సైతాన్’. ఇందులో మెయిన్ లీడ్ బాలి తల్లిగా నటించిన సావిత్రిని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఈమె ట్రైలర్లో అయితే తల్లిగా పద్ధతిగానే కనిపించింది కానీ.. సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఓ పోలీస్ కి ఉంపుడుగత్తెగా రెండు, మూడు ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించి షాకిచ్చింది. ఈ సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది ఈ సీనియర్ నటి.
ఇంతకీ ఈమె ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? వంటి ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. ‘సైతాన్’ వెబ్ సిరీస్ లో హీరో తల్లి సావిత్రి పాత్రని పోషించిన నటి పేరు షెల్లీ నబుకుమార్ అలియాస్ షెల్లీ కిషోర్. ఒకప్పుడు మలయాళం సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఈమె 1983 ఆగస్టు 18న దుబాయ్‌లో జన్మించింది. ఒకసారి మలయాళ మనోరమ న్యూస్ పేపర్‌లో ‘కనల్ కన్నడి’ ఫిలిం మేకర్ తమ సినిమాలకు కాస్టింగ్ కాల్ యాడ్ ఇవ్వడం జరిగింది.
అది చూసిన షెల్లీ ఫ్రెండ్ ఆ విషయాన్ని ఆమెకు చెప్పగా వెంటనే అప్లై చేసి, ఆడిషన్ ఇచ్చి ఛాన్స్ కొట్టేసింది. కానీ ఆ మూవీ రిలీజ్ కాలేదు. ఈ క్రమంలో ఆమెకు ‘పురుషోత్తమ్’ సీరియల్ డైరెక్టర్‌కి ద్వారా ‘చిత్రశలభం’ అనే సీరియల్‌లో ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత ‘కుట్టు కుడుంబం’ సీరియల్ లో కూడా నటించింది.
ఆ తర్వాత ‘థనీ’ అనే సీరియల్ ద్వారా ఈమె ప్రేక్షకులకి దగ్గరైంది. ఆ తర్వాత పెద్ద స్టార్ అయిపోయింది. 2009లో మెగాస్టార్ మమ్ముట్టి ‘కేరళ కేఫ్’ మూవీతో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకి దగ్గరైంది. ఇప్పుడు ‘సైతాన్’ సీరియల్ తో ఈమెకు మరింత మంచి పేరు వచ్చిందని చెప్పాలి.