‘యమదొంగ’ ‘శ్రీరామరాజ్యం’ ‘నేనున్నాను’ వంటి ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన శివ పార్వతీ.. అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఈమె ‘వదినమ్మ’ అనే డైలీ సీరియల్ లో నటిస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఈమె కరోనాకు గురయ్యిందట. అయితే ఇది రావడం మంచిదే అయ్యింది అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈమె మాట్లాడుతూ..”ప్రభాకర్ గారి ‘వదినమ్మ’ సీరియల్ షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడే నేను కరోనా భారిన పడ్డాను.
హాస్పిటల్ లో పది రోజులు ఉన్నాను. ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. అతని సీరియల్ వల్లే నాకు కరోనా సోకింది. నేను హాస్పిటల్ లో చేరిన తర్వాత యూనిట్ సభ్యులు ఒక్కరు కూడా నన్ను చూడటానికి, బాగోగులు కనుక్కోవడానికి రాలేదు.నేను సినిమాల్లో నటించడం మానేసి ఐదు సంవత్సరాలు అయినప్పటికీ.. జీవిత రాజశేఖర్ గారు వచ్చి నన్ను పరామర్శించారు. కనీసం ఆ సీరియల్ యూనిట్ నుండి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బు కూడా వచ్చే అవకాశం కూడా కల్పించలేదు.
ఇప్పుడు వాళ్ళను నిందించి లాభం లేదు. కేవలం థ్యాంక్స్ మాత్రమే చెప్పాలి. నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం అయిన ప్రభాకర్ గారికి థ్యాంక్స్. ఇలాంటి పరిస్థితి రావడం వల్లనే మనుషులు ఎలా ఉంటారో…. వారితో మనం ఎలా నడుచుకోవాలో అర్ధం అయ్యింది” అంటూ చెప్పుకొచ్చింది శివ పార్వతి.
Most Recommended Video
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?