కరోనా దెబ్బకు… ఇప్పుడు దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీలు సైతం ఇళ్ళకే పరిమితమవుతున్న పరిస్ధితుల్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఈ టైములో ఏ చిన్న జలుబు వచ్చినా ప్రజలంతా భయబ్రాంతులకు గురువుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రధాని మోడీ కూడా లాక్ డౌన్ ను మే 3 వరకూ పొడిగిస్తూ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ భర్త ఆండ్రూ కొచీవ్ కు కరోనా సోకింది అనే వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా అతను పొడి దగ్గు, జ్వరం వంటి ‘COVID-19’ లక్షణాలతో సఫర్ అవుతున్నట్టు శ్రీయ తెలిపింది.
దీంతో అతన్ని సెల్ఫ్ క్వారంటైన్ లో పెట్టాం అని ఆమె తెలిపింది. ఇంట్లోనే అతనికి ఓ ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసి అందులో ఉంచుతుందట. ఉన్నట్టు ఉండి తన భర్తకు ఇలాంటి పరిణామాలు ఎదురవ్వడంతో ఆమె చాలా టెన్షన్ కు గురైందట. ప్రస్తుతానికి పర్వాలేదని… ఒకవేళ పరిస్ధితి శృతి మించితే ఆసుపత్రికి తరలిస్తాను అని ఆమె తెలిపింది.