టాలీవుడ్ తో పాటు కోలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన శ్రీయ శరణ్ ఇప్పటికీ పెద్ద సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. ఈ ఏడాది వచ్చిన పెద్ద సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఈమె ఓ ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇంకా పలు చిత్రాల్లో, ఓటీటీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇక 40 ఏళ్ళ వయసులో కూడా ఈమె అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తూ వస్తుంది.
రష్యా క్రీడాకారుడు ఆండ్రీ కొస్చీవ్ను 2018 లో సీక్రెట్ గా వివాహం చేసుకున్న ఈ బ్యూటీ అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. విదేశీయుడు కావడంతో శ్రీయ గ్లామర్ షోకి ఇతను ఏమాత్రం అడ్డుచెప్పడు.. అందుకే బహిరంగంగానే వీళ్ళు రొమాన్స్ చేసుకుంటూ, లిప్ లాక్ లు పెట్టుకుంటూ ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఫస్ట్ లాక్ డౌన్ టైములో శ్రీయ ప్రెగ్నెంట్ అయ్యింది.
అయితే ఆ విషయం మీడియాకు లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడింది.గతేడాదిలో ఈమె ఆ విషయాన్ని రివీల్ చేసింది. ‘గమనం’ మూవీ ప్రమోషన్ల టైములో తన భర్త, పాప తో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నానని… ఈమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్న శ్రీయ తన కూతురు రాధాతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె బికినిలో ఉండడం గమనార్హం. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :