టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో శృతి హాసన్ కు (Shruti Haasan) మంచి గుర్తింపు ఉండగా ఆమె సినీ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. పదేళ్లకు పైగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించిన ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం ఎక్కువగానే ఉంది. అయితే శృతి హాసన్ తొలిసారి తన ఆరోగ్య సమస్యల గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం బ్యాడ్ పీరియడ్ గురించి మాట్లాడటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
స్త్రీగా పుట్టడం ఎంతో గర్వపడే విషయమని దేవుడు భావితరాలను తయారు చేసే శక్తి స్త్రీకి మాత్రమే ఇచ్చాడని శృతి హాసన్ పేర్కొన్నారు. అదే సమయంలో భగవంతుడు స్త్రీకి మాత్రమే కొన్ని శారీరక సమస్యలు ఇచ్చారని ఆమె అన్నారు. ఆ సమస్యలపై స్త్రీలు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారని శృతి హాసన్ పేర్కొన్నారు. దీన్ని బాధ్యతగా తీసుకోవాలని శృతి హాసన్ ఇన్ స్టాగ్రామ్ లో చెప్పుకొచ్చారు.
అధిక రక్తస్రావ సమస్యతో పీరియడ్స్ సమయంలో నేను బాధ పడుతున్నానని ఆమె వెల్లడించారు. కానీ నేను అలాగే షూటింగ్స్ లో పాల్గొనేదానినని నా ఆరోగ్య సమస్యను ఎవరికీ తెలియనిచ్చేదానిని కాదని శృతి హాసన్ పేర్కొన్నారు. బాధలో కూడా కామెడీ సీన్స్ లో యాక్ట్ చేసేదానినని ఆమె చెప్పుకొచ్చారు. కళ్లు తిరగడం, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వేధించేవని శృతి హాసన్ వెల్లడించారు.
ఒక్కోసారి ఆడదానిగా ఎందుకు పుట్టానా అని బాధ కలిగేదని శృతి హాసన్ పేర్కొన్నారు. ఆడపిల్లగా పుట్టే సమయంలోనే దేవుడు ఊపిరితో పాటు ఓర్పు, సహనాన్ని తోడుగా ఇస్తాడని ఆమె అన్నారు. ఇంత బాధలను భరిస్తాం కాబట్టే ఒక ప్రాణికి జన్మనివ్వగలుగుతున్నామని శృతి హాసన్ వెల్లడించారు. శృతి హాసన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.