Sneha: పవన్ గురించి గొప్పగా చెప్పిన ప్రముఖ నటి స్నేహ.. ఏమన్నారంటే?
- September 3, 2024 / 06:49 PM ISTByFilmy Focus
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. పవన్ సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా పవన్ పవర్ స్టార్ అని చాలామంది ఫ్యాన్స్ భావిస్తారు. గబ్బర్ సింగ్ (Gabbar Singh) మూవీ తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Sneha

అయితే ది గోట్ మూవీ (The Greatest of All Time) ఈవెంట్ లో భాగంగా ఈ సినిమాలో నటించిన స్నేహ పవన్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. వాస్తవానికి పవన్, స్నేహ కాంబినేషన్ లో సినిమాలు రాలేదనే సంగతి తెలిసిందే. స్నేహ (Sneha) మాట్లాడుతూ తెలుగులో చిరంజీవి (Chiranjeevi) , పవన్ లతో కలిసి పని చేయలేకపోయానని అన్నారు.
పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని స్నేహ (Sneha) తెలిపారు. నా దృష్టిలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ పవన్ కళ్యాణ్ అని స్నేహ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ లో మాత్రమే కాదని రియల్ లైఫ్ లో కూడా పవర్ స్టార్ అని స్నేహ చెప్పుకొచ్చారు. స్నేహ చేసిన కామెంట్లు పవన్ కళ్యాణ్ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

ది గోట్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ది గోట్ సినిమాల హక్కులను మైత్రీ నిర్మాతలు 22 కోట్ల రూపాయలకు తీసుకున్నారని తెలుస్తోంది. అయితే సరైన పబ్లిసిటీ జరగకపోవడం ఈ సినిమాకు మైనస్ అవుతోంది. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ దర్శకుడి కెరీర్ కు సైతం ఎంతో కీలకమని చెప్పవచ్చు.
వరద బాధితులను ఆదుకొనేందుకు ముందుకు రాలేదెందుకు?
తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ పని చేశా..కానీ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో పని చేయలేదు.. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. పవన్ కల్యాణ్ తెరపైనే కాదు, బయట కూడా పవర్ స్టారే!- స్నేహా#Sneha #PawanKalyan #Vijay #GreatestofAllTime #GOATTheMovie #GOATTelugu pic.twitter.com/EvZYxziXm4
— Filmy Focus (@FilmyFocus) September 2, 2024

















