Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Focus » Pawan Kalyan: తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!

Pawan Kalyan: తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!

  • September 2, 2024 / 07:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ని వెంకటేష్ (Venkatesh)..లానే రీమేక్ రాజా అంటుంటారు. ఎందుకంటే కెరీర్లో ఎక్కువగా రీమేక్ సినిమాల్లోనే నటించారు పవన్ కళ్యాణ్. ఓ మంచి కథ ఏ భాషలో రూపొందినా… దాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందించాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకే మనకు ‘ఖుషి’ (Kushi)  ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh)  వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అంతేకాదు పవన్ నటించిన మరికొన్ని రీమేక్..లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇంకొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇంకొన్ని అయితే అసలు సెట్స్ పైకే వెళ్ళలేదు. అలా పవన్ మిస్ చేసుకున్న కొన్ని రీమేక్..లను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

Pawan Kalyan

1) నీరం : మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నీరం’ అనే చిత్రాన్ని ‘శ్రీ సూర్య మూవీస్’ బ్యానర్ పై ‘చెప్పాలని ఉంది’ పేరుతో రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో అది మధ్యలో ఆగిపోయింది. తర్వాత అదే కథని రామోజీరావు (Ramoji Rao) నిర్మాణంలో కె.విజయ భాస్కర్ (K. Vijaya Bhaskar) దర్శకత్వంలో ‘నువ్వే కావాలి’ పేరుతో రీమేక్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తల్లిని తలచుకుంటూ అభినయ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?
  • 2 గుడ్లవల్లేరు ఘటనపై పూనమ్ ఎమోషనల్.. కూతురుగా లేఖ రాస్తున్నానంటూ?
  • 3 హేమ కమిటీని స్వాగతిస్తున్న సమంత.. మిగతా హీరోయిన్ల సంగతేంటి?

2) అప్పు : కన్నడలో పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పవన్ తో రీమేక్ చేయాలని అనుకున్నారు దర్శకులు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) . కానీ పవన్ నో చెప్పడంతో ‘ఇడియట్’ (Idiot) గా రవితేజతో (Ravi Teja) రీమేక్ చేయడం జరిగింది. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. ‘అప్పు’ కి కూడా పూరి జగన్నాథే దర్శకుడు కావడం విశేషం.

3) సేతు : తమిళంలో విక్రమ్ (Vikram) హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ రీమేక్ చేయాలనుకున్నారు. కానీ రీమేక్ రైట్స్ ను ముందుగా జీవితా రాజశేఖర్ (Rajasekhar) ..లు కొనుగోలు చేయడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. తర్వాత ‘శేషు’ పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా ప్లాప్ గా మిగిలింది.

4) గజిని : ఈ సినిమా రీమేక్ రైట్స్ ను ‘గీతా ఆర్ట్స్’ సంస్థ కొనుగోలు చేసి పవన్ తో రీమేక్ చేయాలి అనుకుంది. కానీ తన ఇమేజ్ కి ఇది మ్యాచ్ అవ్వదని భావించి పవన్ నో చెప్పారు.

5) కత్తి (Kaththi) : ‘శ్రీ సూర్య మూవీస్’ సంస్థ ఇదే చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలి అనుకుంది. అందుకే తెలుగు వెర్షన్ ను మొదట రిలీజ్ చేయలేదు. కానీ తర్వాత పవన్ ప్లాన్స్ మారడంతో, దీన్ని పక్కన పెట్టారు. తర్వాత చిరంజీవి (Chiranjeevi) – వినాయక్  (V. V. Vinayak) కాంబినేషన్లో ‘ఖైదీ నెంబర్ 150’ గా (Khaidi No. 150) ఇది రీమేక్ అయ్యింది.

6) దబాంగ్ 2 : ‘దబాంగ్’ రీమేక్ గా ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh)  రూపొంది బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత ‘దబాంగ్ 2’ ని పవన్ తో రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు భావించారు. కానీ పవన్ ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత తన సొంత కథతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (Sardaar Gabbar Singh) ని రూపొందించారు పవన్. అది డిజాస్టర్ అయ్యింది.

7) విక్రమ్ వేద (Vikram Vedha) : తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో కొంతమంది హీరోలతో రీమేక్ చేయాలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఓ దశలో పవన్, రవితేజ..లతో ఫిక్స్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. పవన్ అయితే ఈ రీమేక్ కి నో చెప్పారు.

8) డ్రైవింగ్ లైసెన్స్ : మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) పాత్రకి పవన్ ను అనుకున్నారు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.

9) ఎన్నై అరిందాల్ (Yennai Arindhaal) : గౌతమ్ మీనన్ (Gautham Vasudev Menon) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ‘ఎంతవాడుగాని’ పేరుతో డబ్ అయ్యింది. అయినప్పటికీ చిరు, పవన్ ఇద్దరూ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. పవన్ కోసం కొంతమంది దర్శకులతో ఈ రీమేక్ స్క్రిప్ట్ డెవలప్ చేయించారు. కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదు.

10) ఓ మై గాడ్ 2 (Oh My God2) : బాలీవుడ్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. కానీ పవన్ బిజీ షెడ్యూల్ కి సెట్ అవ్వలేదు.

11) వేదాళం (Vedalam) : తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని కూడా పవన్ తో రీమేక్ చేయాలని నిర్మాత ఏ.ఎం.రత్నం (A. M. Rathnam) ప్రయత్నించారు. కానీ ఎందుకో ఇది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. తర్వాత ‘భోళా శంకర్’ (Bhola Shankar) గా చిరు రీమేక్ చేయడం జరిగింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

బర్త్‌ డే స్పెషల్‌: నటన కాకుండా పవన్‌ కల్యాణ్‌ ఏమేం చేశాడో తెలుసా? లిస్ట్‌ ఇదిగో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

related news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా రెడీ.. పవన్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా రెడీ.. పవన్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ పక్కన విజయ్ సేతుపతి సినిమా… రిస్కే కదా..!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ పక్కన విజయ్ సేతుపతి సినిమా… రిస్కే కదా..!

The 100 Movie: ‘ది 100’ కి పవన్ ఫ్యాన్స్ సపోర్టు గట్టిగానే ఉందిగా..!

The 100 Movie: ‘ది 100’ కి పవన్ ఫ్యాన్స్ సపోర్టు గట్టిగానే ఉందిగా..!

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

Hari Hara Veera Mallu: నిడివి విషయంలో తెలివైన నిర్ణయం తీసుకున్న పవన్ సినిమా టీం..!

Hari Hara Veera Mallu: నిడివి విషయంలో తెలివైన నిర్ణయం తీసుకున్న పవన్ సినిమా టీం..!

Hari Hara Veera Mallu: ఒక్క ట్రైలర్.. చాలా మార్పులు తీసుకొచ్చిందిగా..!

Hari Hara Veera Mallu: ఒక్క ట్రైలర్.. చాలా మార్పులు తీసుకొచ్చిందిగా..!

trending news

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

40 mins ago
Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

4 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

5 hours ago
Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

6 hours ago
Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

6 hours ago

latest news

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

43 mins ago
Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

4 hours ago
వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

4 hours ago
Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

6 hours ago
9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version