గతవారం కురిసిన భారీ వర్షాలకు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు భారీ స్థాయిలో ఎఫెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ మరియు కృష్ణా జిల్లాలు & తెలంగాణలోని ఖమ్మం జిల్లా వరద భీభత్సానికి అతలాకుతలమైంది. ఇరు ప్రాంత ప్రజలకు అండగా ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోలు కూడా తమ వంతు సాయం అందించేందుకు రంగంలోకి దిగారు.
ఇవాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ తనవంతు సహాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల రూపాయలను ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల సహాయ నిధికి ప్రకటించారు. ఎన్టీఆర్ (Jr NTR) తోపాటు విశ్వక్ సేన్ కూడా ఓ 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ చొరవ తీసుకున్నారు కాబట్టి.. ఇప్పుడు మిగతా హీరోలందరూ ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని ఏ విధంగా చాటుకొంటారో చూడాలి.
Jr NTR
మొన్న కేరళలో జరిగిన వరద భీభత్సానికి స్వయంగా వెళ్లి కోటి రూపాయలు అందించిన చిరంజీవి.. ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలకు ఎంత విరాళం ఇస్తారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. కానీ.. ఈ విధంగా సినిమా హీరోలు ప్రజలకు అవసరమైనప్పుడు అండగా నిలుస్తూ.. తమ ఉన్నతిని చాటుకొంటుండడం మాత్రం అభినందనీయం.
ఇదేమీ ఇప్పుడు కొత్తగా మొదలైన పద్ధతి కాదు, సీనియర్ ఎన్టీఆర్ కాలం నుండి, దేశంలో ఎటువంటి విపత్కర పరిస్థితి తలెత్తినా సినిమా ఇండస్ట్రీ ముందుండి కోట్ల రూపాయల విరాళాల్ని అందిస్తూ వస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…