Sonam Kapoor: తన కొడుకు పేరును రివీల్ చేసిన నటి సోనమ్ కపూర్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో అనిల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి సోనమ్ కపూర్. ఈమె ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించినప్పటికీ ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తాను ప్రేమించిన వ్యక్తి ఆనంద్ అహుజాను 2018లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇలా 2018లో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన సోనం కపూర్ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ఈమె గర్భవతి అనే విషయాన్ని తెలియజేస్తూ తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.

ఇలా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే ఈమె తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.ఇక ఈ విషయాన్ని ఆనంద్ అహుజా సోదరి సోషల్ మీడియా వేదికగా బాబు ఫేస్ కనపడకుండా ఫోటోలను షేర్ చేస్తూ అసలు విషయం వెల్లడించారు. ఇకపోతే సోనం కపూర్ సైతం తన కొడుకుకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా తన కుమారుడికి వచ్చిన కానుకలను కూడా సోషల్ మీడియా వేదికగా ఈమె తెలియజేశారు.

ఈ క్రమంలోనే తన కుమారుడికి తయారు చేసిన కస్టమైజ్డ్ బట్టలు మరియు దుప్పట్లను కూడా షేర్ చేసింది. ఈ పిక్‌లో బాబు పేరును పేరును కూడా సోనం కపూర్ పాక్షికంగా తెలియజేశారు. ఆ బట్టలపై కె అహుజా అని రాసి ఉండడంతో తన కుమారుడు పూర్తి పేరును చెప్పకపోయినప్పటికీ కె అనే అక్షరంతో ఈమె తన కుమారుడి పేరు మొదలవుతుంది అంటూ హిట్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో పలువురు తన కుమారుడికి పుట్టబోయే పేరు గురించి చర్చలు మొదలుపెట్టారు. అయితే త్వరలోనే సోనం కపూర్ తన కుమారుడి పేరు తెలియచేయనున్నట్లు తెలుస్తోంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus