Sowcar Janaki: షావుకారు జానకి జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డారా?

Ad not loaded.

సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీల జీవితాలు విలాసవంతంగా ఉంటాయని చాలామంది భావిస్తారు. అయితే ఆయా సెలబ్రిటీలలో కొంతమంది నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిన వాళ్లే కావడం గమనార్హం. ప్రముఖ నటి షావుకారు జానకి తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 370కు పైగా సినిమాలలో నటించారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేషన్ సినిమాలలో ఈమె హీరోయిన్ గా నటించడం గమనార్హం. 2022 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం నుంచి షావుకారు జానకి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం గమనార్హం.

రంగస్థల నాటకాలతో కెరీర్ ను మొదలుపెట్టిన షావుకారు జానకి నటించిన మొదటి సినిమా షావుకారు కావడంతో ఆ పేరునే ఆమె ఇంటి పేరుగా మార్చుకున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ ప్రముఖ నటి ఆ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత కొన్నేళ్లుగా జానకి సినిమాలకు దూరంగా ఉండటం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీ తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని జానకి చెప్పారని వార్తలు ప్రచారంలోకి రాగా

వైరల్ అయిన వార్తల్లో నిజం లేదని తనకు టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కలిసి తాను నటించిన సినిమాలు హిట్ అయ్యాయని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. భర్తతో విడాకులు తీసుకోవడం గురించి జానకి స్పందిస్తూ తాను కష్టపడి సంపాదిస్తుంటే మా ఆయన డబ్బును తాగుడు, వ్యసనాల కోసం ఖర్చు చేసేవారని జానకి కామెంట్లు చేశారు. కొంతకాలానికి ఆస్తులు కరిగిపోయాయని తాను నమ్మకద్రోహానికి గురయ్యానని ఆమె వెల్లడించారు.

ఆ ఆస్తులు ఉండి ఉంటే ప్రస్తుతం వేల కోట్లు అయ్యేవని ఆమె చెప్పుకొచ్చారు. భర్తతో కలిసి ఉంటే పిల్లలను కూడా పెంచలేనని తాను భావించానని ఆమె తెలిపారు. భర్త వల్ల ఫ్యామిలీ విచ్ఛిన్నం అయ్యే పరిస్థితులు వచ్చాయని తాను ఒక్కపూట భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయని షావుకారు జానకి కామెంట్లు చేశారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus