సాయి సుధా సంచలన కామెంట్లు వైరల్..!

ఇటీవల సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడు.. ‘నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను శారీరకంగాను, మానసికంగాను వాడుకుని ఇప్పుడు నీ ఇష్టమొచ్చింది చేసుకో పో’ అంటున్నాడని ప్రముఖ నటి సాయి సుధా ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వెంటనే శ్యామ్.కె.నాయుడిని అరెస్ట్ చేశారు. అయితే తరువాత అతను బెయిల్ పై బయటకు వచ్చేశాడు అనుకోండి.! ఇదిలా ఉండగా..

ఈ విషయంలో తనకు న్యాయం చేస్తామని చెప్పిన పోలీసులు.. ఈమె దగ్గర 5 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపణలు వ్యక్తం చేస్తుంది సాయి సుధా. వివరాల్లోకి వెళితే.. శ్యామ్.కె.నాయుడు కేసు దర్యాప్తు చేపట్టిన సీఐ మురళీకృష్ణ… సాయి సుధా నుండీ రూ. 5 లక్షలు వసూలు చేశాడట.

మరోపక్క.. ‘శ్యామ్.కె.నాయుడు ని అరెస్ట్ చేయకుండా కూడా ఉండేందుకు కూడా రాజీ కుదుర్చుకుని నకిలీ పత్రాలు సృష్టించాడని’ ఈమె ఆరోపిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈమె దగ్గర 5 లక్షలు తీసుకున్నారు అని రుజువు చేయడానికి గల ఆధారాలను కూడా ఈమె ఏసిబికి సమర్పించిందట. నాంపల్లిలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి వెళ్లి మరీ తన దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించినట్టు తెలుస్తుంది.


పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus