Actress Sudha: ఉదయ్ కిరణ్ ను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన నటి సుధ!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు చిత్రం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈయన మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఊహించని విధంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి ఉదయ్ కిరణ్ అనంతరం వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతూ చివరికి ఆత్మహత్య చేసుకుని మరణించారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగినటువంటి ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికీ అభిమానులకు, ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయమనే చెప్పాలి. ఇప్పటికీ ఈయన గురించి మాట్లాడిన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక ఈయనతో కలిసి నటించినటువంటి ఇతర సెలబ్రిటీలు ఏదైనా వేడుకలలో పాల్గొన్న ఇప్పటికి ఉదయ్ కిరణ్ ని తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇలా ఉదయ్ కిరణ్ నటించినటువంటి పలు సినిమాలలో ఈయనకు తల్లి పాత్రలో నటించారు నటి సుధ.

ఇలా ఈయనకు తల్లి పాత్రలో నటించడంతో వీరిద్దరి మధ్య కూడా ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఇక దేవి నవరాత్రులలో భాగంగా ఒక బుల్లితెర కార్యక్రమానికి సుధా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె హీరో ఉదయ్ కిరణ్ ని తలుచుకొని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుధా ఉదయ్ కిరణ్ ఫోటో పట్టుకొని తనని గుర్తు చేసుకుంటూ వాడు నా కడుపున కనక పుట్టి ఉంటే తప్పకుండా బ్రతికుండేవాడు అంటూ ఈమె ఎంతో ఎమోషనల్ అయ్యి మాట్లాడారు.

ఇలా సుధా (Actress Sudha) ఉదయ్ కిరణ్ మరణం పట్ల ఎమోషనల్ కావడంతో షోలో ఉన్న వారందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఉదయ్ కిరణ్ క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది కాదు. ఇక ఈయన ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఈయన మరణానికి సరైన కారణం మాత్రం తెలియదని చెప్పాలి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus