RRR Movie: ‘ఆర్.ఆర్.ఆర్’ లో కీలక సన్నివేశాన్ని బయటపెట్టేసిన నటి..!

‘ఆర్.ఆర్.ఆర్’ ఈ మూవీ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. 2018 నుండీ షూటింగ్ జరుగుతుంది కానీ ఇంకా పూర్తిస్థాయిలో ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. యుక్రేన్ లో జరిపిన చిత్రీకరణతో సినిమా పూర్తయిందన్నారు. కానీ ఇంకా పాటలు అలాగే ప్యాచ్ వర్క్ చాలా ఉందని వినికిడి. ఎన్టీఆర్, చరణ్ లతో పాటు అలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయ,సముద్రఖని వంటి స్టార్లు నటిస్తున్న సినిమా కావడంతో మొదటి నుండీ ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కరోనాతో కుదేలైపోయిన సినీ పరిశ్రమని తిరిగి బాగుచేసే బాధ్యత ఒక్క ‘ఆర్.ఆర్.ఆర్’ కే ఉందని ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా బలంగా నమ్ముతున్నారు. ఈ చిత్రం గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుందన్న సంగతి తెలిసిందే.ఫ్రెండ్ షిప్ డే కానుకగా విడుదల చేసిన దోస్తీ.. పాట సూపర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉండగా..ఇటీవల ఈ చిత్రంలో కీలక సన్నివేశం గురించి ఈ చిత్రంలో ఓ చిన్న పాత్ర చేసిన సుజాత అనే నటి.. ఓ కీలక ఎపిసోడ్ ను రివీల్ చేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “షూటింగ్లో భాగంగా రాంచరణ్ సార్ చాలా ఎత్తు నుండీ పడిపోయారు..!

ఆయన కాలు బెణికింది. అంతకు ముందు చరణ్ సార్… ఎన్టీఆర్ సార్ ను కొరడాతో రెండు దెబ్బలు కొట్టే షాట్ తీస్తున్నారు. ఆ సీన్ లో చరణ్ సార్ రెండడులు వెనక్కి వేయడంతో కిందకి పడిపోయారు.దాంతో సెట్లో ఉన్న వాళ్ళు అంతా కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని లేపారు. ఇక ఆ సీన్ విషయానికి వస్తే… ఎన్టీఆర్ ను చరణ్ సార్ కొరడాతో రెండు దెబ్బలు కొట్టాల్సి ఉంది.అలా రెండు దెబ్బలు కొట్టిన తర్వాత ఎన్టీఆర్ గారికి నిజంగా గాయం అయిందేమో అని అతన్ని గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేశారు. అంత జాలి చరణ్ గారికి. అలాగే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్” అంటూ చెప్పుకొచ్చింది.


బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus