Sunaina: అసలు ఏమి జరిగిందని కంగారు పడుతున్న అభిమానులు..!

కోలీవుడ్ హీరోయిన్ సునైన గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘కుమార్ వ‌ర్సెస్ కుమారి’ అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. స్ట్రెయిట్ తెలుగు సినిమాతో పాటుగా పలు డబ్బింగ్ చిత్రాలతో ఆకట్టుకుంది. 34 ఏళ్ళ వయసులోనూ క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది. తెలుగులో ఆమె చాలా మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. రాజా రాజా చోర, లాఠీ సినిమాలతో ఈ మధ్య మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ..

తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సునయన.. హాస్పిటల్ బెడ్ పై ఉండడం అభిమానులను కలవరపెడుతోంది. తాజాగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా ఒక ఫోటోను షేర్ చేసింది. హాస్పిటల్ బెడ్ పై. ఆక్సిజన్ పెట్టుకొని కనిపించింది. ఇక ఈ ఫోటోకు క్యాప్షన్ గా ‘‘నాకు కొంత సమయం ఇవ్వండి.. నేను మళ్లీ తిరిగి వస్తాను” అని రాసుకొచ్చింది. దీంతో అసలు ఆమెకు ఏమైందో అని అభిమానులు కంగారు పడుతున్నారు.

కొందరేమో ఏదైనా షూటింగ్ అయ్యి ఉంటుంది అంటుండగా.. ఇంకొందరు నిజమే అయి ఉంటుందని చెప్పుకొస్తున్నారు. సునైనకు ఏమైంది అని కోలీవుడ్ మీడియా ఆరాలు తీయడం మొదలుపెట్టింది. ఇక ఏమైనా కానీ, ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఆమె (Sunaina) కోలుకున్నాకా.. అసలు ఆమెకు ఏం జరిగిందో.. సునయననే చెప్తుందేమో చూడాలి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus