ఘనంగా జరిగిన నటి సునంద నిశ్చితార్ధ వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఈ మధ్య కాలంలో వరుసగా సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. ‘ముద్ద మందారం’ సీరియల్ నటి మలశెట్టి కూడా పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయిపోయింది. ఈ మధ్యనే తాను ప్రేమించిన వ్యక్తిని పెద్దల అంగీకారంతో పెళ్లాడనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సునంద అప్పుడు ఎక్కువ డీటెయిల్స్ రివీల్ చేయలేదు. అయితే తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్న సునంద అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. అలాగే తనకు కాబోయే భర్త పేరు శంకర్ అంటూ చెప్పుకొచ్చింది.

సునంద ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే తన యూట్యూబ్ ఛానల్ లో ఎంగేజ్మెంట్ కు సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేసింది ఈ నటి. ‘ముద్దమందారం’ ‘హిట్లర్ గారి పెళ్ళాం’ వంటి సీరియల్స్ లో ఈమె నటించి మెప్పించింది. అంతేకాదు ఇంకా పలు సీరియల్స్ లో సహాయ నటి పాత్రలు చేసింది. డాన్స్ జోడి డాన్స్ షో లో ఈమె విశ్వ పక్కన కూడా పెర్ఫార్మ్ చేసింది.

సునంద వైజాగ్ కు చెందిన అమ్మాయి. తర్వాత హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. ఎంవిఆర్ యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సునంద… మంచి డాన్సర్. తనకి ఉన్న టాలెంట్ ద్వారా సీరియల్ నటిగా అవకాశాలు దక్కించుకుంది సునంద. వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించింది కానీ ఈమె అనుకున్నట్టుగా జరగలేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఆమె ఎంగేజ్మెంట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus