Sunny Leone: ఆ షో వల్లే నేను ప్రజలకు చాలా దగ్గర అయ్యాను!

బాలీవుడ్ స్టార్ స‌న్నీ లియోన్‌.. సన్నీ లియోన్‌ సినీ ప్రస్థానం కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. సౌత్‌ సినిమాలలో కూడా సన్నీ నటిస్తున్నారు. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు. కరెంట్ తీగ, గరుడవేగ, కుల్ఫీ, జిన్నా సినిమాలలో సన్నీ లియోన్‌ నటించారు. గరుడవేగలో సన్నీ అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు సన్నీ లియోన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెర‌వ‌నున్న‌ది. త‌న భ‌ర్త డేనియ‌ల్ వెబ‌ర్‌తో క‌లిసి ఆమె ఇప్ప‌టికే ఫ్రెంచ్ సిటీకి చేరుకున్న‌ది.

కెన్న‌డీ చిత్రం కోసం ఆమె (Sunny Leone) బుధ‌వారం ప్ర‌మోష‌న్ చేయ‌నున్న‌ది. గ్రీన్ గౌన్ వేసుకున్న స‌న్నీ లియోన్‌.. కేన్స్‌లో దిగిన ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసింది. కేన్స్ న‌గ‌రానికి చేరుకున్న ఆ బ్యూటీ ప్ర‌స్తుతం ఇంట‌ర్వ్యూల్లో బిజీగా ఉంది. స‌న్నీ పోస్టు చేసిన ఫోటోల‌కు అభిమానులు కామెంట్ల‌తో లైక్ కొట్టేస్తున్నారు. కెన్న‌డీ చిత్ర ప్ర‌మోష‌న్ కోసం వ‌చ్చిన స‌న్నీ లియోన్‌.. అక్క‌డ రెడ్‌కార్పెట్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ది. రెడ్‌కార్పెట్‌పై పాల్గొన‌డం కొంత టెన్ష‌న్ పుట్టిస్తోంద‌ని ఆ బ్యూటీ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

దానితో పాటు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే పోర్న్ స్టార్ గా మారినట్లు తెలిపింది. అలాగే కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపింది. మొదట్లో నేను అడల్ట్‌ సినిమాల్లో నటించాను. దాంతో సమాజంలో నాపై ఎంతో వ్యతిరేకత ఉంది. ఎంతోమంది నన్ను అసహ్యించుకున్నారు. అదే సమయంలో 2011లో నాకు బిగ్‌బాస్‌ రియాల్టీ షో కోసం భారత్‌ నుంచి అవకాశం వచ్చింది. ఎన్నో రోజులపాటు ఆలోచించిన తర్వాత బాలీవుడ్‌కు రావాలని నిర్ణయించుకున్నాను.

ఈ క్రమంలోనే బెదిరింపులు ఎక్కువయ్యాయి. బాంబు బెదిరింపులు, చంపేస్తామంటూ మెయిల్స్‌ వచ్చాయి. ఆ బెదిరింపులు తట్టుకోలేక బిగ్‌బాస్‌షోను ప్రజెంట్‌ చేసే సంస్థకు సంబంధించిన ప్రధాన వ్యక్తి ఒకరు అప్పట్లో జాబ్‌కు రిజైన్‌ చేసేశారు. భయపడుతూనే నేను షోలో పాల్గొన్నాను. ఆ షో నా కెరీర్‌ను మార్చేసింది. ఇక్కడి ప్రజలకు నన్ను దగ్గర చేసింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొత్తలోనూ ఎన్నో ఇబ్బందులుపడ్డాను. కాకపోతే, ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. అని చెప్పింది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus