Star Actress: పెళ్లి గురించి సుస్మితా సేన్ షాకింగ్ కామెంట్స్.. ఏం చెప్పారంటే?

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సుస్మితా సేన్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సుస్మితా సేన్ ప్రేమ కథలకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సుస్మితా సేన్ నచ్చితే వెంటనే ప్రేమిస్తుందని నచ్చని పక్షంలో అంతే వేగంగా బ్రేకప్ చెబుతుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఆమె పది కంటే ఎక్కువ మందిని ప్రేమించినా ఎవరినీ పెళ్లి చేసుకోకుండా అందరికీ షాకిచ్చింది. అయితే పిల్లలంటే ఎంతో ఇష్టం ఉన్న సుస్మితా సేన్ పిల్లలపై ఉండే మమకారం వల్ల ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు.

రెనీ, అనీషా అనే అమ్మాయిలను దత్తత తీసుకున్న సుస్మితా సేన్ వాళ్లిద్దరికీ ఏ లోటు లేకుండా పెంచుతున్నారు. పిల్లలకు నాన్న లేని లోటు గురించి మాట్లాడుతూ నా పిల్లలు నాన్న లేడని ఎప్పుడూ ఫీల్ కాలేదని ఆమె తెలిపారు. మన దగ్గర ఉన్నది కోల్పోతే మిస్ అవుతామని లేని దాని గురించి మిస్ అయిన భావన రాదని సుస్మితా సేన్ చెప్పుకొచ్చారు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా పిల్లలు ఇప్పుడు పెళ్లి ఎందుకని అడుగుతారని ఆమె అన్నారు.

మాకైతే నాన్న అవసరం లేదని అనేస్తారని నేను భర్తను కోరుకుంటున్నానని కూడా వాళ్లు అనుకోరని సుస్మితా సేన్ కామెంట్లు చేశారు. పెళ్లి గురించి మేము జోక్స్ వేసుకుంటామని వాళ్లకు తండ్రి లేడు అనే లోటు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. నా పిల్లలకు తాత ఉన్నాడని మా నాన్నే వారికి తాతయ్య అని సుస్మితా సేన్ అన్నారు. తాతనే పిల్లలిద్దరికీ అన్నీ అయ్యి ఆడిస్తాడని సుస్మితా సేన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సుస్మితా సేన్ (Actress) వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాలి అనే వెబ్ సిరీస్ లో నటించి ప్రశంసలు అందుకున్న సుస్మితా సేన్ ప్రస్తుతం ఆర్య3 అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus