Taapsee: రిపోర్టర్ల పై మరోసారి నోరు పారేసుకున్న తాప్సి.. వీడియో వైరల్..!

‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తాప్సి అటు తర్వాత ఇక్కడ వరుస ఆఫర్లు దక్కించుకుంది. కానీ సరైన సక్సెస్ లభించకపోవడంతో.. బాలీవుడ్ కి చెక్కేసింది. బాలీవుడ్లో మాత్రం ఈమె బాగానే రాణిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అక్కడి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది.అక్కడ ఈమె నటించే సినిమాలు మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. అందులో కొన్ని కొన్ని తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. ఈ ఏడాది తెలుగులో కూడా ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

ఆగస్టులో ‘దొబారా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాప్సి ఆ మూవీతో ఆశించిన సక్సెస్ ను అందుకోలేకపోయింది.అయితే ఆ సినిమా తాప్సి ని బాగా హర్ట్ చేసినట్టు ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ తో రిపోర్టర్ల పై మరోసారి నోరు పారేసుకుని హాట్ టాపిక్ అయ్యింది. విషయం ఏంటంటే.. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కు విచ్చేసిన తాప్సి అక్కడ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో “తాప్సీ ‘దొబారా’ చిత్రం రిలీజ్ కు ముందు జ‌రిగిన ‘నెగెటివ్ క్యాంపెయిన్‌ ‘ గురించి రిపోర్టర్ ఆమెను ప్రశ్నించాడు.

ఇందుకు ఆమె ‘ఏ సినిమా పై నెగిటివ్ క్యాంపెయిన్ జరగలేదో చెప్పండి అంటూ ఆ రిపోర్ట‌ర్‌ కు ఎదురు ప్రశ్న వేసింది. ఈ క్రమంలో ఆ రిపోర్ట‌ర్ తాప్సీ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మివ్వ‌లేకపోయాడు. తాప్సీ అంతటితో ఆగ‌కుండా మీరు నా ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మివ్వండి అంటూ నిలదీసింది. నేను మీకు జ‌వాబిస్తా. ఏ సినిమాకు నెగెటివ్ క్యాంపెయిన్ జరగలేదో చెప్పండి అంటూ మళ్ళీ ఆ రిపోర్ట‌ర్‌ను ప్ర‌శ్నించింది.

అటు తర్వాత మరో రిపోర్టర్ ‘దొబారా’ చిత్రానికి నెగెటివ్ క్యాంపెయిన్ జరిగిందని రిపోర్ట‌ర్ తాప్సితో అన్నాడు. దీంతో తాప్సి… ‘న‌న్ను ఓ ప్ర‌శ్న అడిగే ముందు మీరు కొంతైనా తెలుసుకుని రండి‘ ఘాటుగా స్పందించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus