తమన్నా చేసుకోబోయే వ్యక్తి ఎవరంటే?

బాహుబలి చిత్రాల తర్వాత మిల్కీ బ్యూటీ చేసిన చిత్రం  నా నువ్వే. జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మిశ్రమ స్పందన అందుకుంది. అయినప్పటికీ అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది.  ప్రస్తుతం హిందీ క్వీన్ రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మి చేస్తోంది. సవ్యసాచిలో ఓ సాంగ్ చేయనుంది. మెగాస్టార్  చిరంజీవి సైరా నరసింహారెడ్డి లో కీలక రోల్ చేస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కన్నే కలైమానే చిత్రంలో నటిస్తోంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న F2 మల్టీస్టారర్ మూవీలో విక్టరీ వెంకటేష్ కి జోడీగా నటిస్తోంది. వీటితోపాటు తెలుగులో ఒకటి, హిందీలో మరో సినిమాకి ఒకే చెప్పింది.

వీటి తర్వాత తమన్నా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలిసింది. అందుకు కారణం పెళ్లి. త్వరలోనే తమన్నా పెళ్లిచేసుకోబోతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఆమె పేరెంట్స్ తమన్నాకి సెట్ అయ్యే వ్యక్తిని వెతికి పెట్టారని తెలిసింది. అతడు అమెరికాలో డాక్టర్‌ అంట. అతని ఫ్యామిలీ బాగా సెటిల్ అయిందని సమాచారం. అక్కడ వారికి చాలా వ్యాపారాలున్నాయని తెలిసింది.  ఇరువైపులా పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి నిశ్చితార్ధానికి ముహూర్తాలు చూస్తున్నారని, పెళ్లి కూడా తొందర్లోనే జరుగుతుందంట. అలాగే వివాహం అనంతరం తమన్నా భర్తతో పాటు అమెరికా వెళ్ళిపోతుందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. అందుకే ఇక నుంచి ఏ కొత్త సినిమాకి తమన్నా సైన్ చేయడం లేదని సినీ వర్గాలవారు స్పష్టం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus