Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ఏడాది సంపాదన అన్ని కోట్లా?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన తమన్నా సినిమా సినిమాకు క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారనే సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్ తో తమన్నా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తమన్నా ఏడాది సంపాదన 16 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. తమన్నా ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా మరికొన్నిరోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. తమన్నా పారితోషికం సినిమాకు 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

తమన్నా (Tamannaah) రెండు దశాబ్దాలుగా జయాపజయాలకు అతీతంగా తమన్నా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తమన్నా రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. బాలయ్య, తమన్నా కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో కూడా అద్భుతంగా నటిస్తారు. గ్లామరస్, బోల్డ్ రోల్స్ లో నటించడానికి కూడా తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

తమన్నాకు ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆమె కెరీర్ మరో రేంజ్ లో ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమన్నా రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్ లో తన రోల్ గురించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో తమన్నా తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు.

తమన్నా రేంజ్ అంతకంతకూ పెరగాలని అభిమానులు భావిస్తున్నారు. తమన్నా సెకండ్ హీరోయిన్ గా నటించడానికి ఓకే చెబుతున్నారు. సీనియర్ హీరోలకు తమన్నా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. తమన్నా అభినయ ప్రధాన పాత్రలకు ఓకే చెప్పాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus