Tamannaah : పారితోషికం కంటే అదే ముఖ్యమన్న తమన్నా..?

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు అయినా ఆమెకు సినిమా ఆఫర్లు ఏ మాత్రం తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. తన ప్రతిభతో మిల్కీ బ్యూటీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ఒకవైపు స్టార్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే వెబ్ సిరీస్ లలో కూడా నటించి తమన్నా వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.

త్వరలో మాస్టర్ చెఫ్ రియాలిటీ షో తమన్నా హోస్ట్ గా తెలుగులో ప్రసారం కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ షో కొరకు తమన్నా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే డిజిటల్ మాధ్యమాలపై తమన్నా రెమ్యునరేషన్ కోసమే దృష్టి పెట్టిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా తమన్నా స్పందించి స్పష్టతనిచ్చారు. సినిమాలతో సమానంగా వెబ్ సిరీస్ లకు, రియాలిటీ షోలకు ఆదరణ లభిస్తోందని తమన్నా అన్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా సినిమాలలో ఆవిష్కరించలేని కొత్త ఆలోచనలను ప్రేక్షకులతో పంచుకోవచ్చని ఆమె చెప్పుకొచ్చారు.

వెబ్ సిరీస్ లు, టీవీ షోల ద్వారా నటిగా నా ఆలోచన పరిధిని విస్తృతం చేసుకొనే అవకాశం ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. యాడ్స్, స్పెషల్ సాంగ్స్ లో నటిస్తే వెబ్ సిరీస్ ల కంటే ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చని తమన్నా తెలిపారు. తాను డబ్బుకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వనని పారితోషికం కంటే తనకు సంతృప్తి ముఖ్యమని తమన్నా వెల్లడించారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus