సోషల్ మీడియా వేదికంగా తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటూ టీవీ నటి శృతిదాస్ పోలీసులను ఆశ్రయించింది. తన శరీర రంగుని అపహాస్యం చేస్తూ ట్రోలింగ్ కి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. గత రెండేళ్లుగా తనను వేధిస్తున్నారంటూ కోల్ కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా తనపై ఏ విధంగా వేధింపులకు పాల్పడుతున్నారో తెలియజేస్తూ ఎమోషనల్ అయింది శృతిదాస్. బ్లాక్ బోర్డ్, బ్లాక్ గర్ల్ అనే పేర్లతో తనను దారుణంగా వేధిస్తున్నారని..
ఓ డైరెక్టర్ ఠీ రిలేషన్ కి ఉన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయింది. ‘నీలాంటి నలుపు రంగు ఉన్నవాళ్లకు అవకాశాలు ఎలా వస్తున్నాయో మాకు తెలుసు.. నీకు ఆఫర్లు వస్తున్నాయంటే కమిట్మెంట్ ఇస్తేనే తప్ప రావని.. డైరెక్టర్ తో రిలేషన్ లో ఉండడం వలన నీకు అవకాశాలు వస్తున్నాయంటూ’ తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నట్లు శృతి చెప్పింది. తన ప్రతిభ కారణంగానే ఇండస్ట్రీలో రాణిస్తున్నానని.. ప్రేక్షకులు ఆదరించడం వలనే తనకు మంచి రోల్స్ వస్తున్నాయని శృతి చెప్పింది.
‘త్రినయని’ సీరియల్ తో టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిదాస్.. ప్రస్తుతం ‘దశేర్ మాతి’ అనే సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక ‘త్రినయని’ అనే సీరియల్ తెలుగులో కూడా రీమేక్ అయింది. తెలుగు వెర్షన్ లో ఆశిఖ గోపాల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు.