Actress Tulasi: పాచి పనిచేసే అత్త.. నిరుపేద భర్త.. నేను అడుగుపెట్టాకే ఆస్తి వచ్చింది: సీనియర్ నటి తులసి

సీనియర్ నటి తులసి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఆమె 56 ఏళ్ల నుండి సినిమాల్లో నటిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కలుపుకుని 700 లకు పైగా చిత్రాల్లో నటించింది ఈమె. మొదట్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది.1967 నుండి 1990 వరకు చాలా తెలుగు సినిమాల్లో నటించిన ఈమె ఆ తర్వాత మాయమైపోయింది. దాదాపు 18 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈమె కృష్ణవంశీ తెరకెక్కించిన ‘శశిరేఖా పరిణయం’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.

అటు తర్వాత ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాల్లో ప్రభాస్ కు తల్లిగా నటించింది. అక్కడి నుండి ఈమె వెనక్కి తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘జులాయి’ ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’ ఇస్మార్ట్ శంకర్’ ‘ఎఫ్3’ వంటి వరుస సినిమాల్లో సహాయనటి పాత్రలు పోషిస్తూ వస్తోంది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ లో ఫేస్ చేసిన సంఘటల గురించి చెప్పి అందరినీ షాక్ కు గురి చేసింది. తులసి మాట్లాడుతూ.. “దర్శకుడు శివమణితో వన్ డే మ్యాచ్ మాదిరి నా పెళ్లయిపోయింది.

బెంగళూరులో మా తాతగారు కట్టిన బాబా గుడిలో మేము వివాహం చేసుకున్నాం. నిజానికి ఆయన చాలా బీదవాడు. అయినా సరే నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను.మా అత్తగారు నాలుగు ఇళ్లల్లో పాచి పనులు చేస్తుండేవారు. నేను ఆ ఇంట్లో అడుగుపెట్టాక ఆస్తి సంపాదించారు. కానీ మా ఆయన హీరోగా పలు సినిమాల్లో నటించి అప్పుల పాలయ్యారు. ఓసారి నేను ‘మిణుగు తార’ అనే సినిమా కథ రాశాను. దాన్ని మేమే నిర్మించాం.

సినిమా హిట్టయితే బాబా గుడి లోపల ప్రభావళి చేస్తానని మా ఆయన మొక్కుకున్నారు. సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. రూ.13 కోట్ల లాభం వచ్చింది, కానీ మా ఆయన మొక్కు మాత్రం తీర్చలేదు. దీంతో వచ్చింది వచ్చినట్లు పోయింది. చాలా లేట్ గా ఆయన మొక్కు తీర్చుకున్నాడు. ఇకపోతే నేను మొదట్లో బాబాను నమ్మేదాన్ని కాదు. నా తమ్ముడు అర్ధాంతరంగా చనిపోయినప్పుడు సాయిబాబాను చాలా తిట్టాను.

అప్పుడు ఒక రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకు బాబా నా గదిలోకి వచ్చి ‘అమ్మా… అని పిలిచి, గత ఏడు జన్మలుగా నువ్వే నా తల్లి అన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ నీ కడుపులో పుడతానని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తమ్ముడు చనిపోయిన ఆరేళ్లకు నాకు కొడుకు పుట్టాడు. అతనికి సాయి అని పేరు పెట్టుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus