పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన తొలిప్రేమ వాసుకి!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌ ని మలుపు తిప్పిన సినిమా తొలిప్రేమ. రెండువందల రోజులు ఆడిన ఈ ప్రేమ కథ ఇప్పటికీ తాజాగానే ఉంటుంది. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే అతికొంతమంది నటీనటుల్లో వాసుకి ఒకరు. పవన్ కళ్యాణ్ కి చెల్లెలిగా నటించిన ఈమె తెలుగువారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఆతర్వాత వాసుకి ఏ సినిమాలోనూ నటించలేదు. ఇంటికే పరిమితమయింది. ఇద్దరి పిల్లలే ప్రపంచంగా బతుకుతోంది.

తాజాగా వాసుకి తన భర్త ఆనంద్‌తో కలిసి  ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పవన్ గురించి ఆమె  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ప‌వ‌న్ ఈ సినిమా స‌మ‌యంలో ఎంతో విలువైన మాటలు చేప్పేవార‌ు. ‘తొలిప్రేమ’ సినిమా సమయానికి నా వయసు 18 ఏళ్లు మాత్రమే కావడంతో అతను చెప్పే వేదాంతం పెద్దగా నా బ్రెయిన్‌కు ఎక్కేది కాదు’’ అని చెప్పింది. సెట్స్ లో ఆనంద్‌తో కలిసి పవన్ జోక్స్ వేసేవారని గుర్తుచేసుకుంది. “ఇప్పటికీ నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. కానీ నాకు సినిమాలో నటించడం కంటే.. కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వడమే ఇష్టం.” అని వాసుకి తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus