బాగా తాగుతాను.. చెప్పడానికి ఎందుకు భయపడాలి : హీరోయిన్

సోషల్ మీడియా పెరిగిన తరువాత.. సెలబ్రిటీల గురించిన సీక్రెట్స్ ఎక్కువ దాగడం లేదు. అయితే సినీ తారలు నేరుగా భయటపడతారా.. ? అంటే కచ్చితంగా చెప్పలేము. వారి ఇన్సెక్యూరిటీ వారికి ఉండచ్చు. ఎందుకంటే.. పేరుపోతుందని కూడా వారు ఆలోచిస్తుంటారు. అయితే వీరందరికీ భిన్నంగా ఓ హీరోయిన్ మాత్రం.. నేను తాగుతాను అని బోల్డ్ గా చెబుతుంది. ఈమె ఎవరోకాదు మలయాళ హీరోయిన్‌ వీణ నందకుమార్. ఇటీవల వచ్చిన ‘కెట్టోయ్‌లాన్ ఎంటె మాలఖా’ అనే చిత్రంలో ఆమె నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

ఇక ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చాలా బోల్డ్ గా కొన్ని విషయాల్ని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ… ‘నాకు తాగుడు అలవాటు ఉంది. నేను బీర్ ఎక్కువ తాగుతాను. కానీ నా అలవాటు వల్ల ఎవ్వరినీ ఇబ్బంది పెట్టట్లేదు. నాకు నేనుగా ఈ అలవాటు చేసుకున్నాను. నేను తాగుతానన్న విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం భయపడను. నాకు అంత ఇన్సెక్యూరిటీ లేదు. ఈ విషయాన్ని చెప్పడానికి మాత్రం ఎందుకు భయపడాలి.? తాగడం నేరమేమీ కాదు.

బీర్ తాగడం గురించి నేను ఎంతైనా మాట్లాడతాను. యూత్.. బీర్ తాగడం ఇప్పుడు చాలా కామన్ అయిపొయింది.” అంటూ చెప్పుకొచ్చింది వీణ. తాను ఇలా ఓపెన్ గా చెప్పడాన్ని కొందరు మెచ్చుకుంటే.. మరికొంతమంది యువతను పక్క దారి పెట్టించేలా ఉన్నాయంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus