దర్శకుడి మూఢనమ్మకం.. ఇబ్బందులు పడ్డ స్టార్‌ హీరోయిన్‌!

సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ అంటారు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయానికి సెంటిమెంట్‌ ఫాలో అవుతుంటారు. అయితే అది ఎవరికీ ఇబ్బంది పెట్టనంతవరకే. ఒకవేళ ఇబ్బంది పెడితే… అది మూఢనమ్మకం అని కూడా అంటుంటారు. ఇలాంటి ఓ మూఢనమ్మకం వల్ల స్టార్‌ హీరోయిన్‌ విద్యా బాలన్‌ (Vidya Balan) చాలా ఇబ్బంది పడిందట. ఈ విషయాన్ని ఆమెనే చెప్పాలి. ఓ దర్శకుడి మూఢనమ్మకంతో 42 రోజులు ఒకే డ్రెస్‌తో ఉన్నాడట. విద్యా బాలన్‌, ప్రతిక్‌ గాంధీ, ఇలియానా (Ileana D’Cruz) ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్‌ సినిమా ‘దో ఔర్‌ దో ప్యార్‌’.

రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓ దర్శకుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ దర్శకుడికి మూఢనమ్మకాలు ఎక్కువని చెప్పిన ఆమె… తన చిత్రానికి మంచి ఆదరణ రావాలని వింతగా ప్రవర్తించారని చెప్పింది. తాను కథానాయికగా నటించిన ఓ సినిమా సెట్‌లో చోటుచేసుకున్న సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పిన విద్యా బాలన్‌…

ఆ చిత్ర దర్శకుడికి మూఢవిశ్వాసాల గురించి చెప్పారు. తన చిత్రం విజయం అందుకోవాలనే ఉద్దేశంతో దాదాపు 42 రోజులపాటు ఒకే షార్ట్ ధరించాడని, దాన్ని తొలుత తాను పెద్దగా పట్టించుకోలేదని, ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ విషయం తెలిసి షాకయ్యా అని చెప్పింది. కట్‌ చేస్తే.. ఆ సినిమా ఘోర పరాజయం అందుకుంది అని చెపపారామె. అయితే ఆ దర్శకుడు ఎవరు? ఆ సినిమా ఏంటి? అనే వివరాలు మాత్రం చెప్పలేదు.

ఆ దర్శకుడు అన్ని రోజులు ఒకే డ్రెస్‌ వేస్తే ఈమెకు ఇబ్బంది ఏంటి అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితి మనకు ఎదురైతే కానీ ఆ ఇబ్బంది ఏంటో చెప్పలేం. అంతేకాదు ఇలాంటి వారిని ఎంతోమందిని చూశానన్నారు. ఒక నిర్మాత కూడా ఇలాగే ప్రవర్తించారని చెప్పింది ఆమె. తానొక దురదృష్టవంతురాలినని అందుకే ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నానని ఓ నిర్మాత చెప్పారని విద్య చెప్పింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus