Vithika Sheru: ఆ విషయాల్లో భర్తకు సపోర్ట్ చేస్తున్న వితిక.. వరుణ్ చాలా లక్కీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలు అందుకుని తర్వాత రోజుల్లో వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న హీరోలలో వరుణ్ సందేశ్ (Varun Sandesh) ఒకరు. నింద సినిమా ఈవెంట్ లో వితిక (Vithika Sheru) మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత వరుణ్ మూవీ ఫంక్షన్ కు రావడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. నింద ప్రమోషన్స్ లో చాలామంది వరుణ్ కెరీర్ ఫెయిల్యూర్ గురించి ప్రశ్నలు అడుగుతున్నారని వితికా షేరు చెప్పుకొచ్చారు.

మీకు మూవీ ఆఫర్లు రావడం లేదు కదా ఫెయిల్డ్ యాక్టర్ కదా అని నా భర్తను ప్రశ్నిస్తున్నారని వితికా షేరు వెల్లడించారు. వరుణ్ ఫెయిల్యూర్ యాక్టర్ కాదని ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి వరుణ్ సందేశ్ ఎన్నో సినిమాలలో నటించారని వితికా షేరు తెలిపారు. సినిమాలు వద్దని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వాళ్లను ఫెయిల్యూర్ యాక్టర్ అంటారని ఆమె కామెంట్లు చేశారు.

వరుణ్ సందేశ్ అలా చేయలేదని ఇండస్ట్రీనే నమ్ముకున్నాడని ఇంకా సినిమాలు చేస్తున్నాడని వితిక పేర్కొన్నారు. ప్రతి సినిమాకు వరుణ్ సందేశ్ నూటికి నూరు శాతం న్యాయం చేస్తాడని ఆమె చెప్పుకొచ్చారు. నింద మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని వితికా షేరు వెల్లడించారు. ఇప్పటివరకు నటించిన సినిమాలలో నింద ఎంతో స్పెషల్ అని వరుణ్ సందేశ్ సైతం చెప్పుకొచ్చారు. వితిక లాంటి భార్య దొరికినందుకు వరుణ్ లక్కీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ నెల 21వ తేదీన నింద సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. రాజేశ్ జగన్నాథం ఈ సినిమాకు దర్శకుడు కాగా ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేయడం సినిమాకు ప్లస్ అవుతోంది. నింద బాక్సాఫీస్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. కల్కి ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఈ సినిమాపై ఎంతమేర ఆసక్తి చూపుతారో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus