టాలీవుడ్ లో నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన ఆదర్శ్ బాలకృష్ణకు సరైన గుర్తింపు రాలేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరికీ దగ్గరయ్యాడు. ఫైనల్స్ వరకు చేరుకొని రన్నరప్ గా నిలిచాడు. అనంతరం అతడికి సినిమా అవకాశాలు బాగానే పెరిగాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు. అయితే తాజాగా ఈ నటుడికి ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తనలంటూ చిన్న నటుల పరిస్థితి ఎలా ఉంటుందో వివరించాడు.
ఆదర్శ్ కు కరోనా సోకిందట. తనతో పాటు ఇంట్లో వారందరికీ కరోనా రావడంతో ఐసోలేషన్ లో ఉన్నారు. తన తల్లిదండ్రులను హాస్పిటల్ లో చేర్పించాడు. ఇదే విషయాన్ని తాను నటిస్తోన్న ఓ సినిమా యూనిట్ కు తెలిపాడట. అయితే ఆదర్శ్ చేయాల్సిన పాత్ర నుండి అతడిని తొలగించి ఆ స్థానంలో మరో నటుడిని తీసుకుందట సదరు సినిమా యూనిట్. తన ప్లేస్ లో మరో నటుడిని తీసుకున్న విషయాన్ని కూడా ఆదర్శ్ కు చెప్పలేదట.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు ఆదర్శ్. పెద్ద హీరోలు, హీరోయిన్ల కోసమైతే సినిమా నిర్మాతలు ఎదురుచూస్తారు. ఎందుకంటే సినిమా భవిష్యత్తు వారిపై ఆధారపడి ఉంటుంది. కానీ చిన్న నటుల విషయంలో అలా కాదు. వారి పోర్షన్ పెద్దగా లేకపోయినా.. ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే వీరికోసం హీరో, హీరోయిన్లు డేట్స్ అడ్జస్ట్ చేయలేరు. కాబట్టి ఇతర నటులను రీప్లేస్ చేయక తప్పదు. కానీ అలా చేస్తోన్న విషయాన్ని నటులను ఇంటిమేట్ చేయడమనేది కనీస బాధ్యత. ఆదర్శ్ కూడా ఈ విషయంలోనే బాధ పడినట్లు తెలుస్తోంది!
Whole family tested +ve for Covid a few days ago. Parents in hospital. Informed my film crew about the same. Was replaced in a jiffy without any intimation whatsoever. The insecurities an actor lives through are beyond measure. But hey, such is life. #COVID19India #covidlesssons
— Aadarsh Balakrishna (@AadarshBKrishna) April 16, 2021
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!