‘A’ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న త్రివిక్రమ్.. వెంకటేష్ 76 కి ఇంట్రెస్టింగ్ టైటిల్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) సినిమాలకి ఆడియన్స్ లో ఉండే క్రేజే వేరు. సింపుల్ కథతో.. సెన్సిబుల్ డైలాగులతో సినిమా తీయడం త్రివిక్రమ్ స్టైల్. అయితే వాటికి ఫ్యామిలీ టచ్ కూడా ఇస్తాడు. ‘నువ్వే నువ్వే’ వంటి లవ్ స్టోరీ తీసినా ‘అతడు’ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా తీసినా, ‘అరవింద సమేత’ వంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా తీసినా.. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు మిస్ చేయలేదు త్రివిక్రమ్.

Adarsha Kutumbam: House No. 47 – AK 47

అందుకే త్రివిక్రమ్ సినిమా వస్తుంది అంటే.. ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమా కచ్చితంగా చూడాలని డిసైడ్ అయిపోతారు. అలాంటిది ఫ్యామిలీ ఆడియన్స్ లో భీభత్సమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరో వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు అంటే.. దానిపై ఎలాంటి హైప్ ఏర్పడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్రివిక్రమ్ రైటింగ్లో వెంకటేష్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలు ఆల్ టైం హిట్లుగా నిలిచాయి.

ఈసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ సినిమా చేయబోతున్నారు. కాబట్టి ఈ సినిమా చాలా స్పెషల్.వెంకటేష్ కెరీర్లో 77వ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెంబర్ 47’ షార్ట్ కట్లో ‘AK47’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. త్రివిక్రమ్ కి ‘అఆ’ ఇంగ్లీష్ లో ‘A’ సెంటిమెంట్ ఉంది. కెరీర్ ప్రారంభం నుండి చూసుకుంటే.. ‘అతడు’ ‘అత్తారింటికి దారేది’ ‘అరవింద సమేత’ ‘అఆ’ ‘అజ్ఞాతవాసి’ ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాల టైటిల్స్ అన్నీ ఆ సెంటిమెంట్ ని ఫాలో అయ్యి పెట్టినవే.

వీటిలో ‘అజ్ఞాతవాసి’ మినహా మిగిలినవన్నీ సూపర్ సక్సెస్ సాధించాయి. వెంకటేష్ సినిమాకి కూడా అదే సెంటిమెంట్ కలిసొస్తుందేమో చూడాలి.

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags