Adhire Abhi: ‘జబర్దస్త్’ అదిరే అభి ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

అభినయ్ కృష్ణ ఇలా అంటే ఎవరికీ అర్థం కాకపోవచ్చు. అదే ‘అదిరే అభి’ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ అయిన ఈ నటుడు అంతకు ముందు పలు సినిమాల్లో కూడా నటించాడు. ప్రభాస్ ఫస్ట్ మూవీ ‘ఈశ్వర్’ లో హీరో ఫ్రెండ్ గ్యాంగ్ లో ఇతను కూడా ఉంటాడు. అభి అసలు పేరు హరికృష్ణ అని ఇటీవల అతను పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ‘అలీతో సరదాగా’ లేటెస్ట్ ఎపిసోడ్ కు అభి మరియు ఆటో రాంప్రసాద్ లు గెస్ట్ లు గా హాజరయ్యారు.

ఇందులో భాగంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసాడు అభి. అతనికి డైరెక్టర్ ఛాన్స్ ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఇతన్ని నిండా ముంచేసాడని చెప్పి షాక్ ఇచ్చాడు. అభి మాటల్లో..”నాకు డైరెక్షన్ అంటే ఆసక్తి ఎక్కువ. రాజమౌళి గారి దగ్గర అది పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు అని భావించి ‘బాహుబలి2’ కి వర్క్ చేశాను. గ్రాఫిక్స్‌ వర్క్‌పై అవగాహన పెరుగుతుందని నా అభిప్రాయం. శ్రీవల్లి గారి సప్పోర్ట్ తో అసిస్టెంట్ గా చేరిపోయాను. ‘బాహుబలి2’ వార్ సీన్స్ కు పనిచేశాను. 2 పడవల మీద ప్రయాణం చేయకూడదని ఉద్యోగాన్ని కూడా వదిలేశాను. సినిమా వాడిగానే చనిపోవాలని కోరిక.

ఇదే ఆలోచనతో ముందుకు సాగుతుండగా.. మంచి కథ చెబితే ఓ వ్యక్తి బాగుందని అప్రిషియేట్ చేసాడు.ఆయనే నిర్మిస్తానని హామీ ఇచ్చాడు. హీరో హీరోయిన్లను వెతుక్కోమన్నాడు. ఈ క్రమంలో నేను హర్షవర్ధన్‌ రాణేను కలిసి హీరోగా ఒప్పించాను. హీరోయిన్‌గా అర్జున్‌ కూతురికి కూడా కథ చెప్పి ఓకే చేయించుకున్నాను. అయితే ఓ రోజు అత్యవసరంగా రూ.5 లక్షలు పంపమన్నాడు ఆ వ్యక్తి. సినిమాకు అన్ని కోట్లు పెట్టే వ్యక్తికి రూ.5 లక్షలు ఇవ్వడంలో ఏముందిలే అని పంపించాను. ఆ తర్వాత ఆ డబ్బులు తిరిగి తీసుకునేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు అభి.


బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus