త్వరలో ‘ఆది పురుష్’ అప్డేట్స్ వస్తున్నాయా..?

ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హిందీ డైరెక్టర్ ఓం రౌత్ తో కలిసి చేస్తున్న సినిమా ఆదిపురుష్. రామయాణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి పూర్తి అప్డేడ్స్ రాబోతున్నాయా అంటే నిజమే అంటున్నారు బాలీవుడ బ్రదర్స్. ప్రభాస్ రాముని పాత్రలో అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటిస్తున్నట్లుగా మనందరికీ తెలిసిందే. అయితే, మిగతా క్యారెక్టర్స్ లో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది మాత్రం అఫీషియల్ గా ఇప్పటివరకూ కన్ఫర్మేషన్ లేదు.

అందుకే, ఏప్రిల్ 21వ తేదిన శ్రీరామనవమి సందర్భంగా ఈ అప్డేట్స్ ని ఇవ్వాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందట. స్టార్ కాస్టింగ్స్ తో పాటుగా, ఒక మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రీసంట్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు అయితే కొన్ని కారణాలవల్ల అక్కడ పైర్ యాక్సిడెంట్ అయ్యింది. అందుకే ముహూర్తం మారుస్తూ మోషన్ వర్క్స్ తో పాటుగా ఒకేసారి షూటింగ్ ని ప్లాన్ చేస్తున్నారు. చాలా ఈజీగా షూటింగ్ ఫినిష్ అయ్యేందుకు భారీ క్రూ వర్క్ చేయబోతోందట.

అందుకే అతి తక్కువ డేట్స్ తోనే ఆర్టిస్టుల సీన్స్ అన్నీ కూడా ప్లాన్ చేసేశారు. ఇందులో గ్రాఫిక్స్ వర్క్ మైండ్ బ్లోయింగ్ గా ఉండటం గ్యారెంటీ అని అంటున్నారు. మరి రెగ్యులర్ గా మనం వినే సంపూర్ణ రామయాణ కథని చెప్తారా.. లేదా కేవలం కొన్ని అంశాలని మాత్రమే టచ్ చేసి వదిలేస్తారా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఆదిపురుష్ వెనక దాగున్న అసలు కథ తెలియాలంటే మనం మరిన్ని రోజులు ఆగాల్సిందే. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus