బిగ్ బాస్ హౌస్ లో ఈవారం కెప్టెన్సీ టాస్క్ పెద్ద చిచ్చు పెట్టింది. ముఖ్యంగా ఆదిరెడ్డి ఇనాయపై విరుచుకుపడ్డాడు. అసలు టాస్క్ లో ఏం జరిగిందంటే., వస్తా నీ వెనుక 10వ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఇనయకి ఇంకా ఆదిరెడ్డికి ఇద్దరికీ గట్టిగానే పడింది. అసలు ఎందుకు గొడవ అయ్యింది. ఏంటా మేటర్ అంటే , ఆదిరెడ్డి కెప్టెన్సీ టాస్క్ లో ఎందుకు శ్రీసత్య బస్తానే టార్గెట్ చేసాడనేది వివరణ ఇచ్చాడు. ఈ విషయంలో ఇన్వాల్ అయిన ఇనయతో ఆర్గ్యూమెంట్ కి దిగాడు. రోహిత్ గేమ్ లో నుంచీ అవుట్ అయిపోయిన తర్వాత శ్రీసత్య, ఆదిరెడ్డి ఇంకా ఫైమా ముగ్గురే ఉన్నారు.
ఇక్కడ ఫైమా క్లియర్ గా నాకు సపోర్ట్ చేయమని ఆదిరెడ్డిని అఢిగింది. కానీ, ఆదిరెడ్డి మాత్రం నాకు కూడా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను లాస్ట్ వరకూ ఆడతా అన్నాడు. శ్రీసత్య బస్తాలో ఎక్కువ థర్మాకోల్స్ ఉన్నాయి. ఎందుకంటే, అంతకుముందు రోహిత్ ఫైమాది, అలాగే ఆదిరెడ్డిది ఇద్దరిదీ కొంత పారేశాడు. అందుకే, ఆదిరెడ్డి శ్రీసత్యని టార్గెట్ చేసి ఆమె బస్తాని మొత్తాన్ని లాగేశాడు. అలాగే శ్రీసత్య కూడా మ్యాగ్జిమమ్ ఆదిరెడ్డి బస్తాని ఖాళీ చేసింది. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగానే ఆడారు. సంచాలక్ రేవంత్ కి ఎవరిది తక్కువుందో చూసేందుకు చాలా టైమ్ పట్టింది. అయితే, ఇక్కడే ఆదిరెడ్డిని గెలిచావా గెలిపించావా అంటూ రేవంత్ మాట్లాడాడు.
తర్వాత శ్రీహాన్ శ్రీసత్య ఇద్దరూ కూడా ఆదిరెడ్డి గేమ్ ని పాయింట్ అవుట్ చేశారు. ఫైమా కోసం గేమ్ ఆడావని చాలా క్లియర్ గా కనిపించిందని అన్నారు. అయితే నేను అలా గేమ్ ఆడలేదు. నాగార్జున సార్ వచ్చాక మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఫైమా ఏం మాట్లాడుకున్నామో అంటూ క్లియర్ గా చెప్పాడు ఆదిరెడ్డి. ఆదిరెడ్డి శ్రీహాన్ కి శ్రీసత్యకి ఎక్స్ ప్లనేషన్ కూడా ఇచ్చాడు. ఎవరైనా ఎక్కువ థర్మాకోల్స్ ఉన్నవాళ్లని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటాడు. బుద్ది ఉన్నవాడెవడైనా అలాగే అనుకుంటాడు అని చెప్పాడు. ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది. కానీ, ఎప్పుడైతే ఇనయ ఇన్వాల్ అయ్యిందో ఇనయపై జులుం ప్రదర్సించాడు.
చాలా మాటలు అన్నాడు. ఇక్కడ ఇనయ కలిసి ఆడినట్లుగా అనిపిస్తోందని క్లియర్ గా చెప్పింది. మీరు అందరూ ఆడేటపుడు ఒక్కసారి కూడా ఫైమాని ఎటాక్ చేయలేదు, అలాంటపుడు కలిసి ఆడలేదంటే ఎలా అని అడిగింది. ఛాన్స్ దొరికినపుడు తీస్కోవద్దని చెప్పాడు. కలిసి ఆడితే రాంగా, రాంగా అంటూ నిలదీశాడు. ఇక్కడే ఇనయా మీరు ఒప్పుకోవాలి కదా అంటూ మాట్లాడింది. ఒకరి సపోర్ట్ నేను కోరుకోను అని ఆదిరెడ్డి అంటే, మీరు కోరుకోలేదు కానీ చేశారు. అదే కనిపిస్తోందని చెప్పింది. ఇక్కడే మాట మాట పెరుగుతూ పోయింది. ఏం చేస్కుంటావో చేస్కో అంటూ ఆదిరెడ్డి రెచ్చిపోయాడు. జనాలు చూస్తారనే నా ధైర్యం అంటూ అరిచాడు.
అలాగే, ఇనయ గేమ్ ని తప్పుబట్టాడు నీ జెర్నీలో అంతా వెన్నుపోటు రాజకీయమే అని, సూర్యని గుద్ది మరీ పంపావ్ కదా అంటూ ఎద్దేవా చేశాడు. నిజానికి ఆదిరెడ్డి టాస్క్ లో ఒక్కసారి కూడా ఫైమా బస్తాని ఎటాక్ చేయలేదు. ఇదే విషయాన్ని అడిగేసరికి బుకాయించే ప్రయత్నం చేశాడు. ఇనయ చాలా క్లియర్ గా ఫైమాని రోహిత్ ఎటాక్ చేస్తుంటే మరి మీరు ఎందుకు వెళ్లి రోహిత్ ని ఎటాక్ చేశారు అంటూ నిలదీసింది. పాయింట్ మాట్లాడింది. అది కలిసి ఆడటం కాదా అని ప్రశ్నించింది.
దీనికి ఆన్సర్ ఇవ్వకుండా రోహిత్ ది హోల్ పడినపుడు నేను ఎటాక్ చేశానని బుకాయించాడు. కానీ, ఫైమాని ఎటాక్ చేసేటపుడు ఆదిరెడ్డి క్లియర్ గా రోహిత్ ని ఎటాక్ చేశాడు. ఇక్కడే ఫైమా కూడా ఇనాయపై విరుచుపడింది. ఈరోజు కంటెంట్ లేదు కదా అందుకే ఇలా చేస్తోందని ఫైమా అంటే, నీ జెర్నీ అంతా ఇంతే అంటూ ఆదిరెడ్డి రెచ్చిపోయాడు. ఏదైనా అంటే బాత్రూమ్ లోకి వెళ్లి తలుపువేసుకుంటావ్, సెల్ఫ్ హర్టింగ్ చేస్కుంటావ్ అన్నట్లుగా మాట్లాడాడు.
ఫైమా కూడా ఇనాయాని మాటలు అంటూ ఎగతాళి చేసింది. ఇఖ్కడ క్లియర్ గా కలిసి ఆడలేదని నిరూపించుకోవాలనే చూశాడు ఆదిరెడ్డి.ఒకవేళ కలిసి ఆడినా తప్పులేదని చెప్పాడు. అది ఒప్పుకుంటే అయిపోద్ది కదా అనేది ఇనయ వాదన. ఇందులో ఖచ్చితంగా ఆదిరెడ్డి ఇనయని చాలామాటలు అన్నాడు. తన గేమ్ ని చిన్నచూపు చూశాడు నో డౌట్. ఛీ, అపమ్మా, ఏయ్ అంటూ గట్టిగా అరుపులు అరిచాడు. ఇనయా లాజిక్స్ మాట్లాడుతూ ఆదిరెడ్డికి మెరుపులు చూపించింది. మొత్తానికి అదీ మేటర్.