ఆదిరెడ్డి అన్న ఆ మాటకే రోహిత్ కి కోపం వచ్చింది. అసలు పాయింట్ ఇదే..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో ఆరోవారం నామినేషన్స్ అనేది ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి. ముఖ్యంగా ఆదిరెడ్డి, రోహిత్ ఇద్దరూ మీదమీదకి వెళ్లి మరీ అరుచుకున్నారు. ఇది ప్రోమో వచ్చినప్పటి నుంచీ ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ చూద్దామా అని బిగ్ బాస్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. అసలు గొడవకి కారణం ఏంటంటే., నామినేషన్స్ లో ఫస్ట్ ఆదిరెడ్డి రోహిత్ భార్య అయిన మెరీనాని నామినేట్ చేశాడు.ఇక్కడే ఏదో లాజిక్స్ వర్కౌట్ చేద్దామని రీజన్ చెప్పాడు. శనివారం నాగార్జున ఆడించిన హిట్ – ఫ్లాప్ టాస్క్ లో ఫైమా మెరీనా ఇద్దరూ ఉన్నారు. ఇక్కడే మెజారిటీ హౌస్ మేట్స్ ఫైమాని ఫ్లాప్ అని, మెరీనాని హిట్ అని ఓట్లు వేశారు. ఇది అసలు నాకు నచ్చలేదని, ఆటతో కాకుండా హౌస్ మేట్స్ తో మంచిగా ఉంటు, మీరు మంచితనంతో ముందుకెళ్తున్నారు అంటూ ఆదిరెడ్డి మెరీనాని నామినేట్ చేశాడు. ఈ పాయింట్ పై మెరీనా చాలాసేపు ఆర్గ్యూ చేసింది. ఆటలో నేను ముందే ఉన్నానని, ఆట అంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం చక్కగా చూస్కోవడం కూడా అంటూ వాదించింది.

హౌస్ మేట్స్ కాళ్లు నొప్పులు పుట్టే వరకూ ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. ఆదిరెడ్డి అరిచి అరిచి అలసిపోయినా కూడా మెరీనా తిరిగి జవాబు చెప్తునే ఉంది. వీళ్ల ఆర్గ్యూమెంట్ తర్వాత రోహిత్ వచ్చి ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు. టాస్క్ లో మీది ఎంటర్ టైన్మెంట్ తక్కువగా ఉందని రీజన్ చెప్పాడు. దీన్ని మాత్రమే యాక్సెప్ట్ చేశాడు ఆదిరెడ్డి. ఇక్కడే ఇధ్దరికీ కొద్దిగా ఆర్గ్యూమెంట్ జరిగింది. తర్వాత మెరీనా కూడా వచ్చి ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. కెప్టెన్సీ మీరు చేసేటపుడు వర్క్ ని సరిగ్గా డివైడ్ చేయలేదని, నేను, ఇంకా కిచెన్ డిపార్ట్ మెంట్ లో వాళ్లం ఎక్స్ ట్రా వర్క్ చేస్తూ కష్టపడ్డామని చెప్పింది. నామినేషన్ చేసేటపుడే ఒకరిని చేస్తే ఇద్దరూ వచ్చి చేస్తున్నారంటూ మాట్లాడాడు ఆదిరెడ్డి. మెరీనాని కిచెన్ లో ఎక్కువ వర్క్ చేసేటపుడు అప్పుడే నన్ను అడగాల్సిందంటూ కౌంటర్ ఎటాక్ చేశాడు ఆదిరెడ్డి. కిచెన్ లో నేను కూడా ఉన్నాను కదా అని రోహిత్ మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ పెరిగింది.

వాళ్లు నుంచున్న ప్లేస్ నుంచీ మీద మీదకి వచ్చి మరీ అరుచుకున్నారు. ఇక్కడే ఆదిరెడ్డి ఆలోచించి మాట్లాడు అని, నామినేషన్ చేస్తే కోపం ఎందుకు వస్తోందని రోహిత్ ని రెచ్చగొట్టాడు. ఇద్దరూ కలిసి గేమ్ ఆడుతున్నారని, ఒకరు వేస్తే ఒకరు ప్యాకేజ్ లాగా నామినేట్ చేస్తున్నారని ఆదిరెడ్డి అనేసరికి రోహిత్ ఆదితో ఆర్గ్యూపెట్టుకున్నాడు. ఇక్కడే నీ పాయింట్ వచ్చినపుడు వాయిస్ రైజ్ చేయమని, వైఫ్ తో కాదు, కలిసి ఆడుతున్నారంటూ ఆదిరెడ్డి రెచ్చిపోయాడు. దీనికి రోహిత్ కౌంటర్ వేశాడు. నీ ప్లేస్ కి వెళ్లి నుంచో అని ఆదిరెడ్డి చెప్పగానే, నువ్వు నా ప్లేస్ కి వచ్చావ్ అంటూ రోహిత్ రెచ్చిపోయాడు. ఇద్దరి మద్యలో గట్టి ఫైట్ అయ్యింది. ఇద్దరూ కలిసి ఆడుతున్నారని, ప్యాకేజ్ గా వన్ ప్లస్ వన్ నామినేషన్ వేశారని ఆదిరెడ్డి అనగానే రోహిత్ కి కోపం వచ్చింది. అసలు పాయింట్ వదిలేసి ఇది పట్టుకుని అరుచుకున్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే.,

హౌస్ లో ఆదిరెడ్డి ఎంటర్ టైన్మెంట్ లో తక్కువగా ఉన్నాడంటూ రోహిత్ నామినేట్ చేశాడు. ఇది కూడా ఆదిరెడ్డికి నచ్చలేదు. అంతేకాదు, ఆదిరెడ్డి అసలు మెరీనా ఫైమా కంటే ఎందులో గ్రేట్ చెప్పమంటూ హౌస్ మేట్స్ అందర్నీ ఉద్దేశ్యించి మాట్లాడాడు. ఇది కూడా రోహిత్ కి మండేలా చేసింది. ఏదిఏమైనా నామినేషన్స్ లో ఆదిరెడ్డి ఇంకా రోహిత్ ఇద్దరూ హైలెట్ అయ్యారనే చెప్పాలి. వీరిద్దరి అరుపులతో హౌస్ దద్దరిల్లిపోయింది. ఇక మద్యలో కెప్టెన్ రేవంత్ ఇన్వాల్ అయి నామినేషన్స్ ప్రక్రియ స్మూత్ గా అయ్యేలా చూశాడు. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus