బిగ్ బాస్ హౌస్ లో అడవిలో ఆట టాస్క్ పూర్తి అయ్యింది. మూడురోజులు ఈ ఆట ఆడిన హౌస్ మేట్స్ దొంగలుగా, పోలీసులుగా విడిపోయి వారి ప్రతాపాన్ని చూపించారు. పోలీస్ టీమ్ లో ఇనయ సుల్తానాకి దెబ్బలు తగిలి కొద్దిగా రెస్ట్ తీసుకుంది. ఫైనల్ గా పోలీసుల దగ్గర రెడ్ ట్యాగ్స్ కట్టిన బొమ్మలు ఎక్కువగా ఉండటం వల్లే పోలీసులు ఈ టాస్క్ లో గెలిచారు. దొంగల టీమ్ లో సూర్య, ఇంకా శ్రీహాన్ ల దగ్గర ఎక్కువగా మనీ ఉండటం వల్ల వాళ్లిద్దరూ కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు.
ఇక గీతు రాయల్ టాస్క్ ముగిసే సమయానికి మొత్తం 51 బొమ్మలని కొనుక్కుంది. అంతేకాదు, తన దగ్గర ఇంకా 15800 క్యాష్ ని కూడా మిగుల్చుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన రూల్ ప్రకారం 25 బొమ్మలు, 15వేల క్యాష్ ఉంటే గీతు గెలిచినట్లే. కాబట్టి గీతు రాయల్ కెప్టెన్సీ పోటీదారులుగా రేస్ లో నిలిచింది. పోలీస్ టీమ్ నుంచీ బెస్ట్ పెర్ఫామన్స్ ఇచ్చిన కారణంగా ఆదిరెడ్డిని హౌస్ మేట్స్ అందరూ కెప్టెన్సీ రేస్ లో నిలబెట్టారు. అలాగే, గోల్డెన్ కొబ్బరిబొండాం తీసుకున్న కారణంగా శ్రీసత్య కూడా కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచింది.
గేమ్ మొత్తం, టాస్క్ మొత్తం బాగా ఆడినా కూడా రేవంత్ దగ్గర ఎలాంటి మనీ ఉంచుకోలేదు. అలాగే, నేహా కేవలం 3వేలు మాత్రమే సంపాదించి వెనకబడింది. ఆరోహి, వాసంతీ, కీర్తి , సుదీప నలుగురు కూడా దొంగల టీమ్ నుంచీ ఎలాంటి మనీని సంపాదించలేకపోయారు. శ్రీహాన్, సూర్య ఇద్దరూ మాత్రమే రేస్ లో నిలబడ్డారు. అంతేకాదు, అర్జున్ కూడా చాలా బొమ్మలు సంపాదించినప్పటికీ రేస్ లో నుంచీ తప్పుకున్నాడు.
కెప్టెన్సీ పోటీదారులుగా ఫైనల్ గా ఆదిరెడ్డి, శ్రీసత్య, సూర్య, శ్రీహాన్, ఇంకా గీతు రాయల్ ఐదుగురు పోటీపడినట్లుగా సమాచారం. ఇందులో ఫైనల్ గా కెప్టెన్సీ టాస్క్ లో ఆదిరెడ్డి గెలిచినట్లుగా తెలుస్తోంది. సో, మూడోవారం కెప్టెన్ గా ఆదిరెడ్డి హౌస్ ని లీడ్ చేయబోతున్నాడు. ఇప్పటివరకూ సేఫ్ జోన్ లోనే ఉన్న ఆదిరెడ్డి మూడోవారం కూడా కెప్టెన్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీని దక్కించుకున్నట్లు అయ్యింది. మొత్తానికి అదీ మేటర్.