Prabhas: ప్రభాస్ వాళ్లకు అలా సర్ప్రైజ్ ఇస్తారా.. ఆ నటుడు ఏం చెప్పారంటే?

  • July 13, 2024 / 04:45 PM IST

ప్రభాస్ (Prabhas) సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కి ప్రేక్షకులను నిరాశకు గురి చేసిన సినిమాలలో ఆదిపురుష్ (Adipurush) సినిమా కూడా ఒకటి. ఆదిపురుష్ సినిమాలో నటించిన సన్నీ సింగ్ తాజాగా ఒక సందర్భంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరో ప్రభాస్ నాకు అన్నయ్యలాంటి వాడని సన్నీ సింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. ఆదిపురుష్ సినిమాలో సన్నీ సింగ్ (Sunny Singh) లక్ష్మణుడి రోల్ లో నటించారు.

ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నాకు అన్నయ్య రోల్ లో కనిపించారని రియల్ లైఫ్ లో కూడా ఆయన పెద్దన్నయ్య అని సన్నీ సింగ్ చెప్పుకొచ్చారు. మా నాన్నతో కూడా ప్రభాస్ సన్నీ సింగ్ నా తమ్ముడిలాంటి వాడని చెప్పారని ప్రభాస్ నాతో చాలా సరదాగా ఉండేవారని ఆయన వెల్లడించడం గమనార్హం. నా పుట్టినరోజున ప్రభాస్ ఏడెనిమిది సార్లు కాల్ చేశారని సన్నీ సింగ్ పేర్కొన్నారు.

ప్రభాస్ ఇతర సెలబ్రిటీల పుట్టినరోజులు గుర్తు పెట్టుకుని మరీ సర్ప్రైజ్ ఇస్తున్నారంటే ఈ హీరో ఎంతో గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా ఈ సినిమా 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. కల్కి సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కల్కి సీక్వెల్ లో నాగ్ అశ్విన్ (Nag Ashwin) మరిన్ని ప్రపంచాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తారని సమాచారం అందుతోంది. కల్కి సీక్వెల్ సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి సీక్వెల్ తో నాగ్ అశ్విన్ పేరుప్రఖ్యాతులు మరింత మారుమ్రోగటం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus