ఫస్ట్ వీకెండ్ లో కళ్లు చెదిరే స్థాయిలో ఆదిపురుష్ మూవీ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీక్ డేస్ లో మాత్రం ఆదిపురుష్ మూవీ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. ఈ సినిమా కలెక్షన్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఆదిపురుష్ మూవీ ఫుల్ రన్ దాదాపుగా ముగిసినట్లేనని చెప్పవచ్చు. ఆదిపురుష్ మూవీ త్రీడీ వెర్షన్ టికెట్ రేట్లపై మేకర్స్ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు. అయితే ఆదిపురుష్ మూవీ తెలుగు హక్కులను కొనుగోలు చేసింది పీపుల్స్ మీడియా అనే సంగతి తెలిసిందే.
త్వరలో రిలీజ్ కానున్న (Bro Movie) బ్రో సినిమాను నిర్మించింది కూడా ఈ బ్యానర్ అనే సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమా నష్టాలను మిగిల్చితే ఆ నష్టాలను భర్తీ చేయడానికి ప్రముఖ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు బ్రో మూవీ హక్కులు కోరే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ మూవీ నష్టాలను పవన్ సినిమా భర్తీ చేయాల్సి ఉంది. మరోవైపు ఈ మధ్య కాలంలో విడుదలైన ప్రతి పెద్ద సినిమాకు ఏపీలో టికెట్ రేట్లను పెంచుతున్నారు.
సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలైతే ఏపీలో ఆ సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతాయని టాక్ ఉంది. బ్రో సినిమాకు టికెట్ రేట్లు పెంచకపోయినా పరవాలేదని తగ్గించకపోతే చాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. ఇతర హీరోల గురించి పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆయా హీరోల అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు.
ఇతర హీరోల ఫ్యాన్స్ మద్దతు దక్కితే పవన్ కు పొలిటికల్ గా మేలు జరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి సినిమా కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారని తెలుస్తోంది.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్