Prabhas: నెట్టింట హల్ చల్ చేస్తున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఫ్యాన్ మేడ్ పోస్టర్..!

ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ‘రాధే శ్యామ్’ ‘ఆదిపురుష్’ ‘సలార్’ వంటి వాటితో పాటు నాగ్ అశ్విన్ తో కూడా ఓ బడా ప్రాజెక్టుని చేయబోతున్న సంగతి తెలిసిందే. వీటిలో అత్యంత ప్రెస్టీజియస్ గా రూపొందుతున్న చిత్రం మాత్రం ‘ఆదిపురుష్’ అనే చెప్పాలి. బాలీవుడ్లో ‘తానాజీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. పైగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఫాంటసీ మూవీ..!

అంతేకాకుండా రామాయణంలోని మనకి తెలియని అంశాన్ని దర్శకుడు ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ డ్రామాలు అయితే పర్వాలేదు.. కానీ అయోధ్య రామ మందిరం నిర్మాణం ఆరంభ దశలో ఉన్న ఈ టైములో ‘ఆదిపురుష్’ మూవీ ఏమాత్రం తేడా కొట్టినా బోలెడన్ని వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది.దీంతో చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో శ్రద్ధ పెట్టి ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రాముని పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ఆ పాత్రలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ చిత్ర యూనిట్ సభ్యులు ఆ లుక్ ను ఇంకా రివీల్ చేయలేదు. అయితే ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ .. ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ పోస్టర్ అద్భుతం అంటూ కొనియాడుతున్నారు ప్రేక్షకులు. నిజంగా ఇది ఆకట్టుకునేలానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus