Adipurush: ‘ఆదిపురుష్’ తో ఓపెన్ కాబోతున్న ‘ఎఎఎ’ మల్టీప్లెక్స్!

ఈ ఏడాది టాలీవుడ్లో రాబోతున్న మొదటి స్టార్ హీరో సినిమా ‘ఆదిపురుష్’. ప్రభాస్ నటించిన ఈ మైథలాజికల్ మూవీ పై మంచి అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ తప్ప అందరూ బాలీవుడ్ నటులే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్..శ్రీరాముని పాత్రలో కనిపించబోతున్నాడు. టీజర్ అంతగా ఇంపాక్ట్ చూపకపోయినా ట్రైలర్లు రెండు ప్రేక్షకులను మెప్పించాయి. ఓ పెద్ద సినిమా వచ్చి.. అందులోనూ స్టార్ హీరో సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది కాబట్టి ‘ఆదిపురుష్’ కి పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు..

ఓపెనింగ్స్ కూడా అదిరిపోతాయి అని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్లో లోని, అమీర్ పేట్ వద్ద సత్యం థియేటర్ బాగా ఫేమస్. కొన్నాళ్లుగా ఆ థియేటర్ రన్ అవ్వడం లేదు. అల్లు అర్జున్ – ఏసియన్ వారు ఆ థియేటర్ ను మల్టీప్లెక్స్ గా మార్చారు. జూన్ 16 న ఆ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. ఈ మల్టీప్లెక్స్ లో మొదట రిలీజ్ అయ్యే సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush) కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక్కడ స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ఎక్కువగా ఉంటారు.

వాళ్లకు వీకెండ్ వచ్చింది అంటే ఏదో ఒక సినిమా చూడాల్సిందే. ఎఎఎ మల్టీప్లెక్స్(ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్) లో 5 స్క్రీన్స్ ఉంటాయి. సో రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో ఎక్కువగా సినిమాలు చూసే కాబట్టి.. ఎక్కువ రెవెన్యూ తెచ్చే మల్టీప్లెక్స్ గా ‘ఎఎఎ’ నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus