Adipurush Trailer: ఆ తేదీన ఆదిపురుష్ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుందా?

ఈ ఏడాది థియేటరల్లో విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాలలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ స్థాయిలో ఖర్చు చేయడంతో పాన్ ఇండియా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ మూవీ ఈ ఏడాది జూన్ నెల 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఈ ఏడాది మే నెల 17వ తేదీన ఆదిపురుష్ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు సంబంధించి అధికారికంగా అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. త్వరలో ప్రభాస్ సైతం ఆదిపురుష్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. నెమ్మదిగా ఆదిపురుష్ పై అంచనాలు పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

ఈ సినిమా విజువల్ ట్రీట్ గా ఉండనుందని అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ ను అప్ గ్రేడ్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్ బిట్ కు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఓం రౌత్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

ఆదిపురుష్(Adipurush) సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి భవిష్యత్తులో వచ్చే అప్ డేట్స్ సైతం సినిమాపై అంచనాలు పెంచుతాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరో 50 రోజుల్లో రిలీజ్ కానున్న ఆదిపురుష్ ప్రభాస్ వరుస్ ఫ్లాపులకు బ్రేక్ వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus