Adipurush: ఆదిపురుష్ మూవీ మరో వివాదంలో చిక్కుకుందా.. ఏం జరిగిందంటే?

ఆదిపురుష్ మూవీకి వివాదాలు కొత్త కాదనే సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మొదలైన రోజు నుంచి ట్రైలర్ విడుదలైన రోజు వరకు ఈ సినిమా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించి ఈ సినిమాపై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. అయితే ఆ వివాదాలకు నెమ్మదిగా చెక్ పెట్టిన ఆదిపురుష్ తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మేకర్స్ నిర్లక్ష్యం వల్లే ఈ సినిమా పదేపదే వివాదాల్లో చిక్కుకుంటోందని కొంతమంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ మూవీ నుంచి తాజాగా కొత్త పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ లో హనుమంతుని తల దగ్గర కొన్ని ఎత్తైన భవనాలు కనిపించడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొరపాట్లను పదేపదే ఎందుకు రిపీట్ చేస్తున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ పోస్టర్ ను హాలీవుడ్ పోస్టర్ నుంచి కాపీ కొట్టారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మైథలాజికల్ సినిమాలను తెరకెక్కించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ సైతం చెబుతున్నారు.

పదేపదే వివాదాల్లో చిక్కుకోవడం (Adipurush) ఆదిపురుష్ కు మైనస్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 16వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. వైరల్ అవుతున్న పోస్టర్స్ ప్రభాస్ అభిమానులను ఒకింత కంగారు పెడుతున్నాయి. మరోవైపు జూన్ నెల 15వ తేదీన ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్ మూవీ ప్రదర్శితం కానుంది.

ఈ ప్రీమియర్ షోకు సంబంధించి టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఆదిపురుష్ సినిమా ఏకంగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus