Adipurush Release Date: ఆదిపురుష్ అఫీషియల్ రిలీజ్ వచ్చేసింది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మొట్ట మొదటి మైతలజికల్ ఫిల్మ్ ఆదిపురుష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా కృతి సనోన్ సీత పాత్రలో నటిస్తోంది. ఇక రావణాసురుడి క్యారెక్టర్ లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. క్యాస్టింగ్ తోనే అంచనాలను పెంచేసిన ఈ సినిమా 3D లో రూపొందుతోంది.

హై టెక్నాలజీతో దాదాపు 350కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై గత కొన్ని రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా చిత్ర యూనిట్ సభ్యులు మహాశివరాత్రి సందర్భంగా సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది అనగా 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. పూర్తిగా 3D లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ గతంలో ఎప్పుడూ లేని విధంగా రాముడి పాత్రలో రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు గా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ రాధేశ్యామ్ సలార్ ప్రాజెక్ట్ కే సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.

అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనేది ఒక యాక్షన్ సినిమాను కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలుకానుంది. మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా ఈ ఏడాదిలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus