తొలి మూడు రోజుల్లో భారీ స్థాయిలో వసూళ్లు రావడంతో ‘ఆదిపురుష్’ సినిమాకు భారీ విజయం, అలాగే అతి భారీ వసూళ్లు పక్కా అనుకున్నారంతా. అయితే ఊరించి ఉసూరుమనిపించిన రుతుపవనాల్లాగా ‘ఆదిపురుష్’ సినిమా కూడా తుస్‌మనిపించింది. వందల కోట్ల నెంబర్ల నుండి పదుల కోట్లలోకి వచ్చేశాయి వసూళ్లు. ఇప్పుడు పది లోపలే ఉన్నాయి అని అంటున్నారు. మొత్తంగా రూ. 500 కోట్ల నెంబర్ చూపిద్దామన్నా అవ్వడం లేదు అని టాక్. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్ చేసేస్తారని సమాచారం.
ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. పది రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందమే ప్రకటించింది. అయితే ఆ తర్వాత నెంబర్లేవీ బయటకు రావడం లేదు. అయితే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం భారత్‌లో ఈ సినిమా రూ.300 కోట్ల నెట్ వసూళ్ల మార్కును దాటినట్లు చెబుతున్నారు. దీంతో సినిమా థియేట్రికల్ రన్ ముగింపునకు వచ్చినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మరో వారం పాటు (Adipurush) ‘ఆదిపురుష్’ థియేటర్‌లో కొనసాగడం సవాలే అని సమాచారం. ఈ క్రమంలో సినిమా ఓటీటీ విడుదలపై చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే దక్కించుకున్న సంగతి తెలిసిందే. అమెజాన్ జులై 15, 16 తేదీల్లో ‘అమెజాన్ ప్రైమ్ డే’ ఉంది. ఆ సందర్భంగా ‘ఆదిపురుష్’ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు సమాచారం.
దీనిపై చిత్ర బృందం, ఓటీటీ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే జులై 16న ‘ఆదిపురుష్’ స్ట్రీమింగ్‌కు వస్తే సరిగ్గా నెల రోజులకు ఓటీటీకి వచ్చినట్లే. మరి స్పెషల్ డే నాడు ఈ వివాదాల సినిమా వస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే అలహాబాద్ హైకోర్టు ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీ తదితర అంశా మీద సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఓటటీ విడుదల ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!