Adipurush: ఆ టీజర్ ప్రభాస్ సినిమాకు మైనస్ అయిందా?

ఆదిపురుష్ సినిమాపై అంచనాలు పెంచడానికి మేకర్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆదిపురుష్ మూవీ టీజర్ లో గ్రాఫిక్స్ ఆశించిన విధంగా లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఆదిపురుష్ పై రోజురోజుకు అంచనాలు తగ్గుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై ఆసక్తి చూపించిన స్థాయిలో ఆదిపురుష్ సినిమాపై ఆసక్తి చూపించడం లేదు. ఓవర్సీస్ లో ఆదిపురుష్ సినిమాకు డిమాండ్ తగ్గిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆదిపురుష్ మూవీ టీజర్ ప్రభాస్ సినిమాకు బిజినెస్ పరంగా మైనస్ అయిందని కొంతమంది చెబుతున్నారు. ప్రభాస్ ఇతర సినిమాలకు మాత్రం రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. అయితే ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ తో మెప్పిస్తే మాత్రం ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆదిపురుష్ ప్రభాస్ కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలవాలని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఈ సినిమాను తెరకెక్కించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పౌరాణికాలపై అవగాహన లేకుండా సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే దర్శకుడు ఓం రౌత్ కు కొత్త సినిమా ఆఫర్లు ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. నెగిటివ్ కామెంట్లతో సంబంధం లేకుండా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఓం రౌత్ యాక్షన్ సినిమాలకే పరిమితమైతే బెటర్ అని రిస్కీ ప్రాజెక్ట్ లను ఎంచుకోవద్దని అతని శ్రేయోభిలాషులు సూచనలు చేస్తున్నారు. రిస్కీ ప్రాజెక్ట్ ల వల్ల ఓం రౌత్ కెరీర్ రిస్క్ లో పడుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ఓం రౌత్ కాంబోలో మరో సినిమా వచ్చే ఛాన్స్ మాత్రం లేదని తెలుస్తోంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus