‘రామాయణ’ టీజర్: ఓం రౌత్ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్ తివారీ చేస్తున్నారా?
- April 2, 2026 / 10:54 AM ISTByFilmy Focus Desk
టీజర్ రిలీజ్‌కి ముందు.. రిలీజ్ తర్వాత.. ‘ఆదిపురుష్’ సినిమా గురించి మాట్లాడితే ఈ లైన్ పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే సినిమా పరిస్థితిని మొత్తం మార్చేసింది ఆ టీజరే. అందులో చూపించిన విజువల్సే. టీజర్‌లో చూపించిన విజువల్స్ గ్రాండియర్‌గానే కనిపించినా.. అందులో చూపించిన కంటెంట్ విషయంలో విమర్శలు వచ్చాయి. రావణాసురుడిని అలా ఎలా చూపిస్తారు, వానరుల్ని అలా ఎలా చూపిస్తారు అంటూ విమర్శలు వచ్చాయి. రాముడి పాత్రను చూపించిన విధానంలోనూ రియాక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు వచ్చిన ‘రామాయణ’ సినిమా టీజర్‌లో అదే పరిస్థితి కనిపించడమే.
Ramayana Teaser
రణ్‌బీర్ కపూర్ – సాయి పల్లవి సీతాములుగా నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న సినిమా ‘రామాయణ’. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చిన ఈ టీజర్‌లో రాముడి పాత్రను పరిచయం చేశాడు. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ పర్‌ఫెక్ట్‌గా సరిపోయాడు అని చెప్పొచ్చు. ఆ రాజసం, ముఖంలో వర్చసు అద్భుతంగా కుదిరాయి. మిగిలిన పాత్రను దూరం నుంచి చూపించారు. తర్వాత వారి లుక్స్ రివీల్ చేస్తారు.

ఈ టీజర్‌లో రాముడి పాత్ర కాకుండా ఎక్కువ సేపు కనిపించిన పాత్ర ఓ విచిత్రమైన వ్యక్తి/ జంతువు అని చెప్పొచ్చు. దాంతోపాటు ఓ పెద్ద పక్షి. టీజర్ ప్రారంభంలో పక్షి వచ్చి ఏదో ఆయుధం (మిసైల్ లాంటిది) కారణంగా నేలకొరిగిపోతుంది. ఆ తర్వాత ఓ విచిత్ర ఆకారం వచ్చి మరింత హింసిస్తుంది ఆ పక్షిని. ఈ రెండూ ఏంటి అనేది రామాయణం గురించి తెలిసినవారికి అవగాహన ఉండొచ్చు. అయితే ఇప్పటివరకు రామాయణంలో చూపించినట్లుగా ఆ రెండు పాత్రలు లేవు. కాబట్టి క్లారిటీ సినిమాలోనే వస్తుంది.

ఒక ఓ పెద్ద రాజభవనం మీదకు నిప్పు కణికలు వచ్చిపడుతున్నట్లుగా చూపించారు. అవెందుకు, ఏంటి అనేది ప్రశ్న. ఏవో మిసైల్స్‌లా దూసుకొస్తున్నాయి. అలాగే టీజర్ ప్రారంభంలో చూపించిన యుద్ధమంతా మంచు ప్రాంతంలో చూపించారు. మనకు తెలిసిన రామాయణంలో మంచు ప్రాంతంలో యుద్ధాలు ఇప్పటివరకు మనం చూడలేదు. ఇదంతా చూస్తుంటే ‘ఆదిపురుష్’ సమయంలో దర్శకుడు ఓం రౌత్ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్ తివారీ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.










